Chanakya Niti : చాణక్యుడి ఈ సూత్రాలు ఫాలో అయితో మీరు జీవితంలో అస్సలు మోసపోరు..
Chanakya Niti : ప్రస్తుతం సమాజంలో మోసాలు బాగా పెరిగిపోతుండటాన్ని మనం చూడొచ్చు. కాగా, అపర చాణక్యుడు ఎప్పుడో సమాజంలో మోసాలు పెరిగిపోతాయని ఊహించాడు. ఈ క్రమంలోనే మోసపోకుండా ఉండేందుకుగాను ఏం చేయాలో తన గ్రంథంలో వివరించాడు. ‘చాణక్య నీతి’ పుస్తకంలో వివరించిన ఆ విషయాలను తెలుసుకుందాం.అపర చాణక్యుడు మానవ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటికీ పరిష్కారాలను తన గ్రంథంలో వివరించాడు. పాలకులు ప్రజలను ఎలా పాలించాలనే విషయాలపైన రాజ్య పాలనలో తెలిపాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన చాణక్యుడు మానవుడి నడవడికపైన చాలా విషయాలపైన క్షుణ్ణంగా వివరించాడు.
‘చాణక్య నీతి’ పుస్తకంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. అందులో మనిషి మోసపోకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై ఇప్పుడు తెలుసుకుందాం.మనం మన కాళ్లకు ముళ్లు గుచ్చుకోకుండా నడువాలనుకుంటాం. అందుకుగాను పాదాలకు చెప్పులు ధరిస్తాం. ఆ మాదిరిగానే దుర్మార్గులను సమాజంలో లేకుండా చేయాలంటే వారి లోపాలను అందరి ముందర ఎత్తి చూపాలి. అలా చేయడం వలన వారు మీ ముందు తల ఎత్తి నడవడానికి ధైర్యం చేయరు. ఇకపోతే సిగ్గు, గౌరవం లేని వ్యక్తులకు ఎప్పుడూ దూరంగా ఉండటమే మంచిది.
Chanakya Niti : మనుషులు జీవించాల్సిన పద్ధతిపై వివరణ..
ఎందుకంటే తన గౌరవాన్నే పట్టించుకోని వ్యక్తి అవతలి వ్యక్తిని ఎలా గౌరవించగలడు. కాబట్టి అటువంటి వ్యక్తులతో ఫ్రెండ్ షిప్ మంచిది కాదు.ఏదేని ఇంపార్టెంట్ వర్క్ ప్లాన్ చేసుకునే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితులలోనూ ఆ ప్లాన్ వేరే వారితో పంచుకోకూడదు. అలా చేయడం వలన మీ ప్లాన్‌ను శత్రువు ఉపయోగించుకునే అవకాశముంటుంది. ప్లాన్ చేసుకుని అది ఆచరణలో సక్సెస్ అయ్యేంత వరకూ ఓపికగా ఉండాలి. ఇతరులను అవమానించే వ్యక్తులకు చాలా దూరంగా ఉండటం మంచిది. ఇకపోతే మీరు ఏదేని విషయంలో వీక్‌గా ఉన్నప్పటికీ బయటకు మాత్రం స్ట్రాంగ్‌గానే ఉండాలి. మీ వీక్‌నెస్‌ను ఎప్పుడూ బయట పెట్టరాదు.