Coconut : దేవుడి గుడిలో కొబ్బరికాయని కొట్టినప్పుడు కుళ్ళిపోతే… సంతోషించండి… ఎందుకో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Coconut : దేవుడి గుడిలో కొబ్బరికాయని కొట్టినప్పుడు కుళ్ళిపోతే… సంతోషించండి… ఎందుకో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :8 April 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Coconut : దేవుడి గుడిలో కొబ్బరికాయని కొట్టినప్పుడు కుళ్ళిపోతే... సంతోషించండి... ఎందుకో తెలుసా...?

Coconut  : చాలామంది గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయని కొడుతూ ఉంటారు. కొన్ని శుభకార్యాలలోనూ , పండుగలలోనూ కొబ్బరికాయలను కొడుతూ ఉంటారు. దేవుడి గుడికి వెళ్ళిన కొబ్బరికాయ కొట్టకపోతే ఆ పూజ అసంపూర్ణం. అయితే కొన్నిసార్లు దేవుడు గుడికి తీసుకువెళ్లిన కొబ్బరికాయను పగలగొట్టి చూస్తే కొబ్బరికాయ కుళ్ళిపోయినట్లు కనిపిస్తుంది. కొన్నిసార్లు కొబ్బరి పువ్వు కనిపిస్తుంది. కొబ్బరికాయ కుళ్ళిపోతే చెడు చెక్కునుమని, కొబ్బరికాయలో పువ్వు కనిపిస్తే శుభశకునం అని భావిస్తుంటారు. దీని వెనక ఉన్న నిజమైన కారణాలు తెలుసుకుందాం. ఇంటికి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా దేవుడిని దర్శించుటకు వెళ్లి ముందు పూజ కోసం కొన్ని వస్తువులను కొనుక్కుంటారు. ముఖ్యంగా అరటి పండ్లు, పువ్వులు, కర్పూరాలు, అగరవత్తులు, కొబ్బరికాయలు వంటి వాటిని కొనుగోలు చేస్తారు. వీటిల్లో కొబ్బరికాయ తప్ప మిగతావన్నీటిని పైన చూసి కొనుగోలు చేయగలం. కానీ కొబ్బరికాయను మాత్రం లోపట చూసి కొనలేము. కొబ్బరికాయ పైకి చూడటానికి బాగానే ఉంటుంది. కానీ లోపల మాత్రం పువ్వు వచ్చిందా లేదా కుళ్ళిపోయిందా అనే విషయం తెలియదు. కొందరు కొబ్బరికాయని కొనేటప్పుడు నీళ్లు ఉన్నాయా లేవా అని ఊపి చూస్తారు. అలా కొబ్బరికాయని కొంటారు. అసలు దేవుడు దగ్గర కొబ్బరికాయని ఎందుకు కొడతారో తెలుసా.. అంతేకాదు కుళ్ళిన కొబ్బరికాయ, పువ్వు వచ్చినా కొబ్బరికాయ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం గుడిలో ప్రత్యేకంగా కొబ్బరికాయలను కొట్టడానికి కారణం కొబ్బరికాయలు తలపై మూడు కళ్ళు ఉంటాయి. మనిషిలోని మూడు చెడు గుణాలను చిహ్నంగా భావిస్తారు. అంటే మనిషిలోని అహంకారం, దురాశ, మాయ.

Coconut దేవుడి గుడిలో కొబ్బరికాయని కొట్టినప్పుడు కుళ్ళిపోతే సంతోషించండి ఎందుకో తెలుసా

Coconut : దేవుడి గుడిలో కొబ్బరికాయని కొట్టినప్పుడు కుళ్ళిపోతే… సంతోషించండి… ఎందుకో తెలుసా…?

Coconut కొబ్బరికాయను ఎందుకు కొడతారు

ఆలయంలో కొబ్బరికాయను పగలగొట్టేటప్పుడు నాలోని చెడు గుణాలను నీ ముందు ఇలా పగలగొడుతున్నాను స్వామి అని అర్థం. పూజలో లేదా ఆలయంలో కొబ్బరికాయ కొట్టడం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఇదే. మూడు కళ్ళు శ్రీమహావిష్ణువు, శివ, బ్రాహ్మణులను సూచిస్తాయని చెబుతారు.

కొబ్బరికాయలో పువ్వులు: దేవుడికి కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వచ్చినట్లయితే అది శుభప్రదం అని అంటారు. బంగారం, భౌతిక సంపదల కలయిక అయినా కొబ్బరికాయ నుంచి పువ్వు పడితే లాభాలను తెస్తుందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. కనుక మీరు పూజకు కొట్టే కొబ్బరికాయలో పువ్వు ఉంటే ఎగిరి గంతు వేసి ఆనందంగా జీవించవచ్చు.

కుళ్ళిన కొబ్బరికాయను కొడితే : దేవుడికి కొబ్బరికాయని కొట్టినప్పుడు అది కుళ్ళిపోతే… మన మనసు వెంటనే చాలా ఆందోళన చెందుతుంది. ఏదైనా చెడు జరుగుతుందేమో అని భయాందోళనలు కలుగుతాయి. కొబ్బరికాయ పగలగొడితే ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే కలిగే ఫలితాలు గురించి తెలుసుకుందాం..

సంతోషంగా ఉండు : కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు అది కుళ్ళిపోతే మీరు దానికి సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇలా జరగడం వల్ల మీ నుంచి మీ కుటుంబ సభ్యుల నుంచి దుష్టశక్తులను, చెడు దృష్టిని తొలగిస్తుందని అర్థమట.

కుళ్ళిన కొబ్బరికాయ : అదేవిధంగా పూజా సమయంలో కొట్టిన కొబ్బరికాయ.. కుళ్ళిపోతే దాని అర్థం తరచూ వచ్చే అనారోగ్యం.. చెడు కలలు, చెడు శకునాలు, చెడు దృష్టి తొలగిపోతుందని అర్థం.

పరిష్కారం ఏమిటంటే : నుంచి దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ కుళ్ళినట్లయితే దాని గురించి మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. నీ మనసులో ఆందోళన నెలకొంటే దానిని కూడా ఒక సులభమైన పరిష్కారం ఉంది.

వీటిని దానం చేయండి : కొబ్బరికాయను పగల కొట్టినప్పుడు కుళ్ళిపోతే ఏ కోరికతో కోరుతున్నాము అది జరుగుతుందో లేదో అని బాధపడుతుంటే.. మీరు ఆందోళన చెందకండి. అందుకు బదులుగా రోజులో ఐదుగురికి లేదా ఏడుగురికి ఆహారాన్ని అందించండి. తర్వాత మళ్లీ అదే కోరికను దేవునికి తెలియజేస్తూ మరొక కొబ్బరికాయను కొని పగలగొట్టండి.. అప్పుడు మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి.. నిదానాలలో ఉత్తమ దానం ఆహారమే..

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది