Devotional News : శనీశ్వరుడిని ఇంట్లోకి రానివ్వకూడదంటే.. మీ ఇంట్లో తమలపాకు మొక్క పెంచాల్సిందే!
Devotional News : తమలపాకుల వల్ల కల్గే ఉపయోగాల గురించి ప్రతీ ఒక్కరికి తెలుసు. చాలా మంది తమలపాకులను నేరుగా తింటుంటారు. మరికొందరు పాన్ తింటూ.. తమలపాకును నములుతారు. అంతే కాదండోయ్ మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏవైనా పూజలూ, వ్రతాలు చేసినా తమలపాకులను కచ్చితంగా వాడుతుంటాం. అవి లేకుండా మనం చాలా వరకు పూజలు, వ్రతాలు, నోములు చేసుకోలేం అంటే అతిశయోక్తి కాదు. అయితే హిందువులు ఇంతగా వాడే ఆ తమలపాకు చెట్టును మన ఇంట్లో పెంచుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కానీ అవేంటో చాలా మందికి తెలియదు. అయితే తమలపాకు మొక్కను ఇంట్లో పెంచడం వల్ల కల్గే లాభాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.తమలపాకులతో ఆంజేనయ స్వామిని పూజించడం వల్ల ఆ స్వామి కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది.
అలాగే తమలపాకు చెట్టున ఇంట్లో పెంచుకోవడం వల్ల భూత ప్రేత భయాలు తొలగి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సిరి సంపదలతో పాటు పేరు, ప్రఖ్యాతలు వస్తాయి. అమృతం కోసం దానవులు, దేవతలు క్షీర సాగన మథనాన్ని చిలికినప్పుడు లక్ష్మీ దేవితో పాటు తమలపాకులు కూడా పుట్టాయని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇంట్లో తమలపాకు చెట్టు పెంచడం వల్ల లక్ష్మీ దేవి మన ఇంటిని వదిలి వెళ్లదు. అంతే కాకుండా శనీశ్వరుడు కూడా ఇంట్లోకి వచ్చేందుకు భయపడతాడు. అలాగే గ్రహ దోషాలు వదిలిపోయి… ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఒక తమలపాకు తీసుకొని దానిపై ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన సింధూరంతో శ్రీ రామ అని రాసి.. దాని ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి పూజించాలి. ఆ తర్వాతి రోజు ఆ ఆకులను తినడం గానీ..
పారే నీటిలో గానీ వేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి.తమలపాకు రసంలో తేనె కలిపి కళ్లకు రాసుకుంటే కొత్త పెక్టోరిస్ వ్యాధి నయం అవుతుంది. అలాగే ఒకటి లేదా రెండు చుక్కల తమలపాకులరసాని చెవి, కళ్లలో వేసుకోవడం వల్ల వినికిపి లోపంతో పాటు అంధత్వ సమస్యలు తొలగిపోతాయి. తమలపాకు వేరు పొగను పీల్చడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. తమలపాకుల ఆకులను వేడి చేసి.. కాస్త ఆముదం రాసి ఛాతికి పట్టిస్తే కఫం తగ్గుతుంది. తమలపాకు రసం తాగడం వల్ల గుండెకు బలం పెరుగుతుంది. అప్పుడే పుట్టిన శిశువులు చనిపోయి రొమ్ములు ఉబ్బితే… తమలపాకులను కాస్త వేడి చేసి పెట్టడం వల్ల వాపు తగ్గుతుంది. అంతే కాకుండా పాలు కూడా ఎండిపోతాయి.