Shaneshwar : శనీశ్వరుడు కన్నెర్ర చేసి ఆగ్రహిస్తున్నాడు… ఇక ఈ రాశులకి చుక్కలే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shaneshwar : శనీశ్వరుడు కన్నెర్ర చేసి ఆగ్రహిస్తున్నాడు… ఇక ఈ రాశులకి చుక్కలే…!

 Authored By ramu | The Telugu News | Updated on :20 February 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Shaneshwar : శనీశ్వరుడు కన్నెర్ర చేసి ఆగ్రహిస్తున్నాడు... ఇక ఈ రాశులకి చుక్కలే...!

Shaneshwar : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే గ్రహాల నీటిలో కూడా శని గ్రహానికి ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఈయన కర్మలకు అధిపతి. శని దేవుడు క్రమశిక్షణకు మారుపేరు. కర్మ, క్రియలను బట్టి వారి జీవితంలోకి వస్తాడు. శని దేవుడు వచ్చినప్పుడు ఒక రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు దారం చేస్తాడు. ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో శని దేవుడు ఆ రాశిలో వివిధ దశలకు లోనవుతాడు. రేపు ఫిబ్రవరి 27వ తేదీన శని కుంభరాశిలో అస్తమించబోతున్నాడు. దీని కారణంగా ఏ ఏ రాశులు శనీశ్వరుడి ఆగ్రహానికి గురి కాబోతున్నారు తెలుసుకుందాం…

Shaneshwar శనీశ్వరుడు కన్నెర్ర చేసి ఆగ్రహిస్తున్నాడు ఇక ఈ రాశులకి చుక్కలే

Shaneshwar : శనీశ్వరుడు కన్నెర్ర చేసి ఆగ్రహిస్తున్నాడు… ఇక ఈ రాశులకి చుక్కలే…!

Shaneshwar కుంభరాశిలో శని అస్తమయం

శనీశ్వరుని యొక్క ఆగ్రహం కుంభరాశిలో శనీశ్వరుడు అస్తమయం జరగటం వలన శని దేవుడు కన్నెర్ర చేయబోతున్నాడు. అయితే ఈ విధంగా జరగడం వల్ల కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఇస్తే, కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇవ్వనున్నాడు. అయితే కుంభరాశిలో శని దేవుడు అస్తమయం జరగటం కారణంగా ప్రతికూల ఫలితాలు ఎదుర్కొనే, బాగా కష్టపడాల్సి వచ్చే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం….

మిధున రాశి : శనీశ్వరుని యొక్క ఆగ్రహం వలన ఆశని అస్తమయం జరుగుతుంది. ఇది మిధున రాశిలో తొమ్మిదవ గృహంలో జరుగుతుంది. మిధున రాశి వారికి ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అనేక అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. శని అస్తమయం నుండి మిధున రాశి వారు పనిలో 3వమైన అడ్డంకులను, వైఫల్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగ వృత్తిలో పనిచేసే వారికి మరియు కార్యాలలో పనిచేసే వారికి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఇబ్బందులు కూడా ఎక్కువగానే ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు మిధున రాశి వారు చాలా జాగ్రత్తలు పాటించాలి.

సింహరాశి :  శని అస్తమయం సింహరాశిలో ఏడవ ఇంట్లో జరగనుంది. అయితే సింహరాశి జాతకులకు అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. మీరు పని చేసే చోట చాలా సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలు తీవ్రమైన ఒత్తిడిని కూడా కలిగిస్తాయి. తే కాదు వైవాహిక జీవితంలో కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉన్నతాధికారులతోనూ మరియు సహ ఉద్యోగులతోను విభేదాలు ఎదుర్కునే అవకాశం ఉంది. డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రతలు పాటించాలి.

తులారాశి : శని అస్తమయం తులా రాశిలో ఐదవ ఇంట్లో జరుగుతుంది. దీనివల్ల ఈ రాశి వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం విషయంలోనూ మరియు వారి చదువు విషయంలోనూ ఆందోళన కి గురవుతారు. ఈ తులా రాశి వారికి ఈ సమయంలో అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. విద్యార్థులు చదువుల విషయంలో, పోటీ పరీక్ష లోను ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రేమ సమస్యలు ఉన్నవారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేసే వారికి కూడా విఫలమయ్యే ప్రమాదం ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది