Dussehra : దసరా రోజు ఈ చర్యలు పాటిస్తే మీరు అనుకున్నది సాధిస్తారు…!
Dussehra : హిందూమతంలో విజయదశమి పండగను ప్రతీ ఏడాది అశ్వయుజ మాసం శుక్లపక్షం దశమి రోజున వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది దశమి అక్టోబర్ 12వ తేదీ ఉదయం 10: 59 గంటలకు ప్రారంభమయ్యే మరుసటి రోజు అక్టోబర్ 13 ఉదయం 09:08 నిమిషాలకు ముగుస్తుంది. అయితే ఈ రోజున దుర్గాదేవికి రాముడికి అంకితం చేయబడింది. ఈ రోజున వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే పురాణాల ప్రకారం శ్రీరాముడు లంక రాజు దశకంఠుడు […]
ప్రధానాంశాలు:
Dussehra : దసరా రోజు ఈ చర్యలు పాటిస్తే మీరు అనుకున్నది సాధిస్తారు...!
Dussehra : హిందూమతంలో విజయదశమి పండగను ప్రతీ ఏడాది అశ్వయుజ మాసం శుక్లపక్షం దశమి రోజున వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది దశమి అక్టోబర్ 12వ తేదీ ఉదయం 10: 59 గంటలకు ప్రారంభమయ్యే మరుసటి రోజు అక్టోబర్ 13 ఉదయం 09:08 నిమిషాలకు ముగుస్తుంది. అయితే ఈ రోజున దుర్గాదేవికి రాముడికి అంకితం చేయబడింది. ఈ రోజున వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే పురాణాల ప్రకారం శ్రీరాముడు లంక రాజు దశకంఠుడు రావణుడిని ఈ రోజున సంహరించాడు. కనుక ప్రతి ఏడాది ఈ రోజున దసరా పండుగ జరుపుకుంటారు. అంతేకాకుండా దసరా పండుగ రోజు దానం చేసే సాంప్రదాయం కూడా ఉంటుంది.
Dussehra : దసరా రోజున ఈ ఆరు చర్యలు చేయండి
-దసరా రోజు వ్యాధుల నుంచి ఉపశమనం పొందడం కోసం సుందరకాండ పారాయణాన్ని పాటించండి. అలాగే చేతిలో కొబ్బరికాయను పట్టుకుని హనుమాన్ చాలీసాలోని ” నాసై రోగ్ హరే సబ్ పీడా..జపత్ నిరంతర్ హనుమంత్ బీరా ” అనే ద్విపదను చదివి రోగి తలపై ఏడుసార్లు తిప్పండి. తరువాత ఆ కొబ్బరికాయను రావణ దహనంలో వేయండి. ఇలా చేయడం వలన అనేక రకాల వ్యాధులు దూరమవుతాయి.
– వ్యాపారంలో పురోగతి పొందడం కోసం విజయదశమి రోజున కొబ్బరికాయ మిఠాయిలు మరియు పసుపు వస్త్రాలతో పవిత్రధారాన్ని బ్రాహ్మణుడికిి దానంగా ఇవ్వండి. దీనివల్ల జీవితంలో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అలాగే వ్యాపారంలో పురోగతినీ పొందుతారు.
– చాలామందికి జాతకంలో శనీశ్వరుడి ఏలినాటి శని ఉన్నవారు దసరా రోజు జమ్మి చెట్టు కింద 11 దీపాలలో నువ్వుల నూనె వేసి వెలిగించి ప్రార్థన చేయడం ద్వారా ఏలి నాటి శని ప్రభావాలు నుండి ఉపశమనం పొందవచ్చు.
– హిందూమతంలో దానానికి విశిష్టమైన స్థానం ఉంటుంది. కాబట్టి విజయదశమి రోజున పేదలకు మరియు బ్రాహ్మణుడికి ఆహారం బట్టలు లేదా వస్తువులను దానంగా ఇవ్వండి. దీనివల్ల ఇంట్లో ఇబ్బందులు తొలిగి పేదరికం దూరమవుతుంది.
– దసరా పండగ రోజు రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడం అనేది ముఖ్య ఘట్టం. ఈరోజు చెడుపై మంచి సాధించిన రోజు కాబట్టి ఒక ప్రదేశంలో రావణ దహనం నిర్వహించి అందులో పాల్గొనండి. దీని ద్వారా జీవితంలో చెడు అంతమవుతుంది.
– దసరా రోజున ఆలయంలో చీపురుని దానంగా ఇవ్వడం ద్వారా ఆర్థిక నష్టాల నుండి బయటపడతారు. ఈ పరిహారాన్ని సాయంత్రం పూట చేయాలి. అలాగే ఈ పరిహారం చేసే సమయంలో లక్ష్మీదేవి కచ్చితంగా ధ్యానం చెయ్యండి.
Dussehra : దసరా ప్రాముఖ్యత
దసరా పండుగ రోజు రాముడిని మరియు దుర్గాదేవిని పూజిస్తారు. అదేవిధంగా కొంతమంది కుబేరుడు మరియు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. లక్ష్మీదేవిని మరియు కుబేరుని పూజించడం వలన ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అలాగే ఆర్థికప్రయోజనాలు ఉంటాయి.