Andhra Pradesh | దసరా సెలవులపై అధికారిక ప్రకటన.. స్కూళ్లకు 9 రోజుల సెలవులు
Andhra Pradesh | తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే దసరా పండగ దగ్గరపడుతున్న నేపథ్యంలో, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు ప్రభుత్వం శుభవార్త అందింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 24 (బుధవారం) నుంచి అక్టోబర్ 2 (గురువారం) వరకు మొత్తం 9 రోజుల పాటు సెలవులు ప్రకటించారు.
#image_title
సెలవులే సెలవులు..
అక్టోబర్ 3 (శుక్రవారం) నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఈ సెలవులు విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకూ విశ్రాంతి లభించే అవకాశం కల్పిస్తున్నాయి. హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు తమ సొంతూళ్లకు వెళ్లే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వేసవి సెలవుల తర్వాత ఇంత భారీగా లభించే సెలవులు ఇవే కావడంతో అందరూ ఆనందంగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అమ్మవారి ఆలయాల్లో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. రైళ్లు, బస్సులకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. పండుగ సీజన్‌లో ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రత్యేక సర్వీసులు నిర్వహించనున్నట్లు సమాచారం.సంక్రాంతి తర్వాత తెలుగు ప్రజలు అత్యంత ఉత్సాహంగా జరుపుకునే పండగ దసరా. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, వేడుకలు జరుగుతాయి. ఈ పండగ సమయంలో సెలవులు రావడం విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులందరికీ ఆనందకరమైన విషయమే.