ఈరోజు సాయంత్రం పౌర్ణమి గడియల్లో ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి .. కుబేరులు అవుతారు ..!
శ్రావణమాసం చాలా విశిష్టమైన మాసం. ఈ మాసంలో వ్రతాలు, పూజలు ఆచరిస్తే చాలా మేలు జరుగుతుంది. శ్రావణ మాసాన్ని ఆధ్యాత్మిక మాసం అని కూడా అంటారు. అయితే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి అనేది ప్రత్యేక మైన రోజుగా పరిగణిస్తారు. శ్రీమన్నారాయణని జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అని, శ్రావణమాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమని మన పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేస్తే ఆమె అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవి. పురాణాల ప్రకారం దేవతలు సముద్ర తీరాన సాగర మధనం చేసిన మాసం శ్రావణమాసం.
అయితే ఈ శ్రావణ మాస పౌర్ణమి రోజున మంచి పనులు చేస్తే మేలు జరుగుతుంది. శ్రావణమాసం పౌర్ణమి నాడు సాయంత్రం ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే కుబేరులు అవుతారు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన లక్ష్మీస్వరూపంగా భావించేటువంటి ఉప్పును శ్రావణ మాసపు సాయంత్రం ఈ చిన్న పరిహారం చేసుకోవాలి. రెండు గుప్పెళ్ళ రాళ్ళ ఉప్పును తీసుకొని గుప్పెట్లో మూసి ఉంచి ఒక పది నిమిషాల పాటు అలాగే పట్టుకొని ఇంటి చుట్టూ తిరగాలి. ప్రతి ఒక్క గదిలోకి వెళ్ళాలి.అలా తిరిగిన తర్వాత దారాళంగా పడుతున్న నీరు అంటే టాప్ ఆన్ చేసి ఉప్పును వదిలేయాలి. దీనివలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది.
దిష్టి తీయటానికి కూడా ఉప్పును చక్కని పరిహారంగా చెబుతూ ఉంటారు. అలా మన ఇంటి చుట్టూ తిరిగినప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదిలోకి తిరిగినప్పుడు మన ఇంట్లో ఉన్న దిష్టి అంతా కూడా ఈ ఉప్పు ద్వారా పోతుంది. అలాగే మన ఒంట్లో ఉన్న దిష్టి అంతా కూడా తొలగిపోతుంది. చెడు శక్తులన్నీ తొలగిపోయాక మనకు నాలుగు వైపులా ధనం వస్తుంది. కుబేరులు అవడం ఖాయం కాబట్టి ఆర్థిక సమస్యలు ఉన్నవారు శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే ఆ సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు.