కుంకుమ విశిష్టత మీకు తెలుసా ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

కుంకుమ విశిష్టత మీకు తెలుసా !

 Authored By keshava | The Telugu News | Updated on :6 May 2021,8:30 am

కుంకుమ.. హిందూ ధర్మంలో పసుపు, కుంకుమలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. వీటిలో ప్రస్తుతం కుంకుమ విశేషాల గురించి తెలుసుకుందాం …

ప్రతి శుభకార్యంలో కుంకుమను వాడుతారు, నిత్యదేవతారాధన, ముఖంపై కుంకుమ ధారణ అత్యంత ముఖ్యంగా భావిస్తారు.

కుంకుమతో కలిగే లాభాలు ఇవే !

do you know about kumkuma

do you know about kumkuma

కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి . అది ఇది స్త్రీ పురుషులు పిల్ల పెద్ద ఎవరైనా సరే పెట్టుకోవడం మంచిది. బొట్టు పెట్టుకుని ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా నా మనల్ని భారతీయులని గుర్తిస్తారు. ఈ కుంకమను నుదిటిపై అంటే భృగుమధ్యమంలో పెట్టుకుంటారు. దీనవల్ల లోపల ఉన్న నాడులు ప్రచోదనం అవుతాయి. అంతేకాదు ఈ కుంకుమ సూర్యుడి నుంచి వచ్చే డీ విటమిన్ను గ్రహించడంలో తోడ్పడుతుందని చెప్తారు. అంతేకాదు మనిషి దృష్టి నుంచి కూడా కాపాడుతుంది. ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల ఏ పని మీద బయటకి వెళ్లినా మనకు నెగిటివ్ రిజల్ట్ లేకుండా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది.

విశేషమైన కుంకుమ తయారీ !

సాధారణమైన కుంకుమ కాకుండా శాస్త్రీయంగా కుంకుమ లేదా బొట్టు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. పసుపును పట్టించుకుని దాంట్లో కుంకుమ రాళ్లను కలుపుకోవాలి. బయట కొన్న కుంకుమ కాకుండా కుంకుమ రాళ్ళ కుంకుమ 100 గ్రాములు తీసుకోండి. ఒక కప్పు కుంకుమ తీసుకోండి 1 టీ స్పూన్ పచ్చకర్పూరం, జవ్వాది పొడి ఈ రెండింటితో ఒక టీస్పూను తిప్పతీగ పొడి ఈకుంకుమలో మూడింటిని కలపండి. అట్లాగే 8 లవంగాలను తీసుకొని వాటిని ఈ కలిపిన కుంకుమలో వేయండి. వీటిని కూడా కలపండి. కుంకుమ సాధారణంగా అయితే లవంగాలు కలపడం వల్ల కుంకుమ పురుగు పట్టకుండా మంచి సువాసనతో ఉంటుంది. అసలైతే ఈ లవంగాలు కలపడం వలనే అనుకున్న పనులు సానుకూలం అవుతాయి. ఇప్పుడే కుంకుమ భరణిలో గాని ఒక డబ్బాలో కానీ పెట్టుకొని . ప్రతి రోజు ప్రొద్దుటే స్నానం చేయగానే ఈ కుంకుమ నుదిటి మీద పెట్టుకోండి. అది అది రాత్రి పడుకునే వరకు ఉండేలా చూసుకోండి. ఏ పని చేసినా నమ్మకంతో విశ్వాసంతో చేయడంవల్ల అంతా బాగుంటుంది. కృత్రిమంగా తయారుచేసిన కుంకుమలను కాకుండా మీరు కొంచెం ఓపిక చేసుకుని శాస్త్రీయమైన పద్ధతులలో సహజ సిద్ధమైన కుంకుమలను తయారుచేసుకుని పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది