Pushpavati : ఏ నక్షత్రాన పుష్పవతి అయితే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pushpavati : ఏ నక్షత్రాన పుష్పవతి అయితే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా?

 Authored By pavan | The Telugu News | Updated on :19 May 2022,7:00 am

Pushpavati : పుట్టిన ప్రతీ అమ్మాయి ఒక వయసు రాగానే పుష్పవతి అవుతుంది. ఇది చాలా సాధారణమైన విషయం. కానీ మన హిందూ సంప్రదాయాల ప్రకారం మొదటి సారి పుష్పవతి అయిన అమ్మాయిని కొన్న రోజుల పాటు ఇంట్లోనే ఓ మూలన కూర్చోబెడుతారు. ఆమెకు అన్ని రకాల ఆహారాలను తినిపిస్తారు. ఐదు, తొమ్మిది, పదకొండు లేదా పదిహేను… ఇలా బేసి సంఖ్య రోజును పెద్ద ఫంక్షన్ చేసి అందరితో కలిపేస్కుంటారు. వీటన్నిటి కంటే ముందుగా… అమ్మాయి పుష్పవతి అయినట్లు తెలియగానే వేద పండితుల వద్దకు వెళ్లి… నక్షత్రం చూస్కుంటారు. ఆ నక్షత్రాలను బట్టి భవిష్యత్తులో జరగబోయే మంచీ, చెడులను జ్యోతిష్య శాస్త్రాల ద్వారా తెలుసుకుంటారు. అయితే నక్షత్రం మంచిది కాకపోయినా, అశుభమైనా చింతించాల్సి పని లేదు.

ఎందుకంటే దానికి తగిన విధంగా.. శాంతి హోమాలు, కర్మలు, పూజలు చేయిస్తే సరిపోతుంది కాబట్టి. అయితే ఏ నక్షత్రంలో అమ్మాయి పుష్పవతి అయితే ఏ ప్రభావం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.అశ్వినీ నక్షత్రంలో అయితే అపారమైన దుఃఖాలు కల్గుతాయి. భరణీ నక్షత్రంలో అయితే సంతానమంతా ఆడ పిల్లలే. కృత్తిక నక్ష్తత్రంలో అయితే మహా దరిద్రం. రోహిణి నక్షత్రంలో అయితే చక్కటి దాంపత్యం. మృగశిర నక్షత్రంలో అయితే అన్యోన్యమైన సుఖ సంసారం. అర్ర్ధ నక్షత్రంలో అయితే పుత్ర సంసారం. పునర్వసు నక్షత్రంలో అయితే దుఃఖమైన జీవితం. పుష్యమీ నక్షత్రంలో అయితే కుటుంబానికి వేదన. అశ్లేష నక్షత్రంలో అయితే సకల శుభాలు. మఘ నక్షత్రంలో అయితే భర్తకి దూరం అవుతారట. అలాగే పుబ్బ నక్షత్రంలో అయితే మగ సంతానాన్ని పొందుతారట. ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో అయితే బాగా చూసుకునే పుత్రుడు పుడతాడట.

do you know the effect of girl mature on which star

do you know the effect of girl mature on which star

హస్త నక్షత్రంలో అయితే అఖండ అదృష్టాన్ని పొందుతారట. చిత్త నక్షత్రంలో అయితే చక్కటి జీవితం. స్వాతి నక్షత్రంలో అయితే భర్త ప్రేమ అపారంగా పొందుతారట. విశాఖ నక్షత్రంలో అయితే నలుగురూ ఈర్ష్యపడే దాంపత్యాన్ని పొందుతారట. అనురాధ నక్షత్రంలో అయితే రోగాలమయమట. జ్యేష్ఠ నక్షత్రంలో అయితే ధన నష్టంతో పాటు చపల చిత్తం. అలాగే మూల నక్షత్రంలో అయితే ఈతి బాధలు, ఆరోగ్య బాధలు ఎక్కువవుతాయట. పూర్వాషాఢ నక్షత్రంలో అయితే కుటుంబానికి ఆవేదన. ఉత్తరాషాఢ నక్షత్రంలో అయితే సంతోషకర జీవితాన్ని సొంతం చేసుకుంటారట. శ్వరణా నక్షత్రంలో అయితే అధికార ఆనందం. ధనిష్ఠ నక్షత్రంలో అయితే ఆయురారోగ్యాలను సొంతం చేసుకుంటారు. శతభిష నక్షత్రంలో అయితే ఆకలి బాధలు ఎక్కువటచ. అలాగే పూర్వాభాద్రపదం లో అయితే శక్తి లేకపోవడం. ఉత్తర భాద్రపదంలో అయితే పది మంది మెచ్చుకునే జీవితం. రేవతి నక్షత్రంలో అయితే సకాల శుభాలను పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి.

Also read

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది