Ganpati Puja : ఏ శుభకార్యాలైన, ఏ పూజ జరిగిన ముందు గణపతి పూజ ఎందుకు చేస్తారో తెలుసా.?
Ganpati Puja : ఏ శుభకార్యాలు జరిగిన, ఏ పూజలు జరిగినా ముందుగా వినాయకుని పూజ చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఆయన కి మొదటగా పూజ చేస్తూ ఉంటారు.. ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హిందూమతంలో ఆరాధించే మొదటి దేవుడు గా వినాయకుని పరిగణించబడ్డాడు. అయితే వినాయకుడిని దేవతలందరిలో ముందు పూజ్యమైన దేవుడుగా ఎందుకు భావిస్తారు తెలుసుకుందాం. వినాయకుడు గురించి రెండు ముఖ్యమైన కథలు ఉన్నాయి. ఒకప్పటి పురాణం ప్రకారం మొట్టమొదటిసారిగా పార్వతీదేవి వినాయకుని తన ద్వారం దగ్గర కాపలా ఉండమని అడిగినప్పుడు గణేషుడు తన తల్లి ఆదేశాలను అనుసరించి కాపలాగా ఉంటాడు. అప్పుడు అక్కడికి పార్వతి దేవి కోసం శివుడు వెళ్తుండగా.. తనని అడ్డుకుంటాడు వినాయకుడు.
దాంతో ఆగ్రహంతో శివుడు గణేశుడివి తల తీసేస్తాడు. దాంతో పార్వతీదేవి ఆగ్రహం వ్యక్తం చేస్తూ విశ్వం మొత్తాన్ని నశింప చేస్తానని ఆదేశిస్తుంది. అప్పుడు శివుడు వినాయకుడికి ఏనుగు తలను తీసుకొచ్చి పెట్టి తనని బ్రతికిస్తాడు. అయితే పార్వతీదేవి గణేశుడి శరీరంపై ఏనుగు ముఖం పెట్టడంతో ఆమె శాంతించలేదు. అప్పుడు శివుడు ఏదైనా శుభకార్యానికి, ముందు ఏదైనా పూజకి ముందు, వినాయకుని ఆరాధిస్తారని, వినాయకుడు ఆశీర్వాదం లేకుండా ఈ కార్యము ముగింపు ఉండదు అని శివుడు గణేశునికి వరమిస్తాడు. అలాగే పందెంలో తెలివిగా గెలుస్తాడు.
ఇంకొక పురాణాల విధంగా శివయ్య ఒక పోటీని ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళిద్దరు కొడుకులకు విశ్వాన్ని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయమని దేవతలందరినీ ఆదేశిస్తాడు. ముందుగా ఎవరు మొదటి ప్రదక్షిణను ముగింపు ఇస్తారు. వారే ఆరాధించబడే మొట్టమొదటి దేవుడిగా ప్రకటించబడతారు. దానికి వినాయకుడు అలాగే కుమారస్వామి తో సహా అందరూ దేవతలు పాల్గొంటారు. కార్తికేయ భగవానుడు తన వాహనమైన నెమలిపై ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో వినాయకుడు తన తల్లిదండ్రులే తన దేవుళ్ళుగా భావించి వాళ్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. దాంతో ఆ పోటీలో విఘ్నేశ్వరుడు రాణిస్తాడు. అప్పుడు శివుడు వినాయకుడిని ముందు ఆరాధించి దేవుడుగా ప్రకటిస్తాడు. అందుకే ఏ పూజలైన, ఏ శుభకార్యాలైన ముందుగా వినాయకుని ఆరాధిస్తూ ఉంటారు.