Vinayaka Chavithi 2025 : మీరు వినాయకుని ప్రతిష్టించాలి అనుకుంటే… ఈ నియమాలు తప్పనిసరి… పాటించకుంటే ఫలితం దక్కదు …?
ప్రధానాంశాలు:
Vinayaka Chavithi 2025 : మీరు వినాయకుని ప్రతిష్టించాలి అనుకుంటే... ఈ నియమాలు తప్పనిసరి... పాటించకుంటే ఫలితం దక్కదు ...?
Vinayaka Chavithi 2025 : ఈ సంవత్సరము కూడా ఎంతో వైభవంగా ప్రజలందరూ వినాయక చవితిని వీధి వీధినా,వాడవాడనా, ఊరు ఊరునా జరుపుకుంటారు. ఈ పండుగనే గణేష చతుర్దది అని పిలుస్తారు. గణేష్ చతుర్దశి రోజున గణేశుడు భూమి పైకి వస్తాడని నమ్మకం. విజ్ఞాలకు అధిపతి అయినా గణేశుని పుట్టినరోజు సందర్భంగా ఆయన అనుగ్రహం కోసం అత్యంత భక్తిశ్రద్ధలతో వినాయక చవితి నాడు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. విఘ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తే జీవితంలో ఆనందం,శ్రేయస్సు లభిస్తాయని పనిలో ఎటువంటి అడ్డంకులు ఏర్పడమని నమ్మకం. ప్రజలు వినాయకుని ప్రతిష్టించే ముందు కొన్ని నియమాలను తెలుసుకోకుండా ప్రతిష్టిస్తారు. ప్రతిష్టించే విషయాలలో తప్పులు చేస్తూనే ప్రతిష్టించిన పుణ్యఫలం దక్కదని చెబుతున్నారు పండితులు. మీరు 9 రోజులు పూజలు చేసిన ఫలితం ఉండదని చెబుతున్నారు.దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగానూ, ఉత్సాహంగా జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం గణేష్ చతుర్దశి బుధవారం 27 ఆగస్టు 2025న జరుపుకుంటారు ఈ పండుగ 10 రోజుల పాటు కొనసాగుతుంది ఈ సమయంలో భక్తులు గణపతిని తమ ఇళ్లల్లో ప్రతిష్టించుకొని గణపతిని పూజిస్తుంటారు.
Vinayaka Chavithi 2025 : మీరు వినాయకుని ప్రతిష్టించాలి అనుకుంటే… ఈ నియమాలు తప్పనిసరి… పాటించకుంటే ఫలితం దక్కదు …?
గణపతి జ్ఞానానికి, శ్రేయస్సుకి అదృష్టానికి దేవునిగా పరిగణిస్తారు. గణపతి విగ్రహ ప్రతిష్టకు ముందు పూజా సమయంలో కొన్ని ప్రత్యేక నియమాలు పాటించడం చాలా ముఖ్యం. ఈ నియమాలు జాగ్రత్తగా పాటించకపోతే పూజలు చేసిన ఫలితం దక్కదు అంటున్నారు. నిపుణులు పరిపూర్ణాంగా ఫలితం కావాలంటే విగ్నేశ్వరుని ప్రతిష్టకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలని చెబుతున్నారు.
గణేష్ చతురుద్ది శుభ సమయం
పంచాంగం ప్రకారం గణేష్ చతుర్థి ఆగస్టు 26 2025 మధ్యాహ్నం 01:54 గంటలకు ప్రారంభమై ఆగస్టు 27 మధ్యాహ్నం 03:44 గంటల వరకు ఉంటుంది. గణపతిని ప్రతిష్టించి పూజించడానికి అత్యంత పవిత్రమైన సమయం ఆగస్టు 27, 2025. ఈరోజు ఉదయం లేదా మధ్యాహ్నం శుభ సమయంలో గణపతి పూజ చేయవచ్చు. సెప్టెంబర్ 6, 2017 వినాయక నిమజ్జనం నిర్వహిస్తున్నారు. ఈరోజు అనంత చతుర్దశి రోజు.
గణేష్ ను ప్రతిష్టించే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నియమాలు
గణపతి తొండం
గణపతి విగ్రహం తొండం ఎడమవైపుకు వంగి ఉంటే విగ్రహాన్ని కొనండి. ఇటువంటి విగ్రహాన్ని పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి.కుడివైపుకు వంగి ఉన్న విగ్రహాన్ని శుద్ధి వినాయక రూపంగా పరిగణిస్తారు. కనుక ఇతర విగ్రహం ఇంట్లో ప్రతిష్టిస్తే పూజకు కొన్ని కఠినమైన నియమాలను పాటించాలి.
స్వచ్చతను జాగ్రత్తగా చూసుకోండి
గణేష విగ్రహాన్ని ఉంచేముందు ప్రార్థన స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేసి అక్కడ గంగాజలాన్ని చల్లుకోండి.
పీఠం లేదా ఆసనం
గ్రహాన్ని నేరుగా నేలపై ఉంచవద్దు విగ్రహాన్ని ఎరుపు లేదా పసుపు వస్త్రంలో కప్పబడిన శుభ్రమైన పీఠం లేదా దర్భాసనం పై ఉంచండి.
మట్టి విగ్రహం
శాస్త్రాల ప్రకారం మట్టితో చేసిన విగ్రహాన్ని పూజిస్తే అత్యంత పవిత్రమైనదిగా పరిగణించడం జరిగింది.విగ్రహ ప్రతిష్టకు ముహూర్తం
గణేష విగ్రహాన్ని చతుర్థి తిథి నాడు మాత్రమే ప్రతిష్టించండి.రాత్రి సమయంలో విగ్రహాన్ని ప్రతిష్టించడం శుభప్రదంగా పరిగణించబడదు.
దిశ
గణేశుని విగ్రహాన్ని ఎల్లప్పుడూ ఇషాని దిశలో ఉంచాలి. ఈ దిశ పూజకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడింది.
అభిషేకం, ప్రాణ ప్రతిష్ట :
విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత అభిషేకం చేయాలి ప్రాణ ప్రతిష్ట మంత్రాన్ని జపించడం ద్వారా విగ్రహంలోకి ప్రాణం పోయండి.
సింధూరం, దర్ప ప్రాముఖ్యత :
గణేశుని పూజలో సింధూరం,దర్ప గడ్డిని సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడింది.
మోధా కాలు నైవేద్యం :
గణపతి పప్పాను మోదకాలు అంటే ఇష్టం కనుక వీటిని చేతి రోజున సమర్పించడం తప్పనిసరి. ఉండ్రాలు, కుడుములు, జిల్లేడు కాయలు ఆయనకిష్టమైన ప్రసాదం అని నమ్ముతారు.
క్రమం తప్పకుండా పూజలు :
సృష్టించిన తర్వాత ఆచారాల ప్రకారం ప్రతి ఉదయం, సాయంత్రం గణేశుని హారతి ఇవ్వాలి. పూజ చేయడం, నైవేద్యాన్ని సమర్పించడం అవసరం.
ఉపవాసం ఆచారం :
తులు వినాయక చవితి రోజున నిమజ్జనం చేసేవరకు నిర్జన లేదా ఫలహార ఉపవాసం పాటిస్తారు. ముఖ్యంగా మహిళలు కుటుంబా ఆనందం, శ్రేయస్సు,పిల్లల దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంటారు.