Ganpati Puja : గణపతి ఆశీర్వాదం కోసం ఏ విధంగా ఆరాధించాలి… ఈ సంవత్సరం గణేశుడి పూజకు అనుకూలమైన సమయం ఎప్పుడు అంటే…
Ganpati Puja : ఇక ఈ నెలలో గణేశుడు ఉత్సవాలు 31 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం గణేశుడి పండుగ ప్రత్యేకత పెరిగింది. వినాయక చతుర్థి నాడు రవి యోగం, శుక్ల యోగం, చిత్ర నక్షత్రం కలయిక అనుకోకుండా జరిగిందని చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. వినాయక చవితి; సిద్ధి బుద్ధి ప్రదాత అయిన గణేశుడిని పూజించే పవిత్ర పండుగగా ఈ ఏడాది 31 ఆగస్టు నా వినాయక చతుర్దతి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. కొన్ని పురాణాల ప్రకారంగా గణపతి మధ్యాహ్న సమయంలో భాద్రపద శుక్లపక్షం చవితి నాడు జన్మించాడు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ చవితి నాడు కలంక చవితి అని కూడా పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఈ ఏడాది వినాయక చవితి బుధవారం నాడు వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం గణేష్ చతుర్థి ప్రాధాన్యత ఇంకాస్త పెరిగింది. వినాయకుడిని ఆరాధించటానికి గొప్ప మార్గం: ఒక పిల్లవాడు విద్యకు సంబంధించిన విషయంలో బలహీనంగా ఉంటే ఈ వినాయక చతుర్దది నాడు వినాయకుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతాడు.
అలాగే ఈ గణపతి దగ్గర పది రోజులు స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తొలగిపోయి జ్ఞానం శక్తి పొందవచ్చు. గణపతిని ఏ విధంగా పూజించాలి: వినాయక చవితి రోజు గణేశుడిని ఆరాధించడానికి మొదటగా గజానుడి విగ్రహాన్ని ఎర్రటి గుడ్డతో ఏర్పాటు చేసుకోండి. దీని తర్వాత గణేశుని ఆవాహన చేయండి. తర్వాత విగ్రహానికి తేనె, పెరుగు, పాలు, గంగాజలం, స్వచ్ఛమైన నెయ్యి ఇలా మొదలైన వాటితో అభిషేకం చేయండి. తర్వాత గణపతిని పసుపు కుంకుమతో అలంకరించండి. తర్వాత వస్త్రాలతో, వస్తువులతో అలంకరణ చేసి ఆయనకు నైవేద్యంగా ఉండ్రాళ్లు, చెరుకు, అరటి పండ్లు, తమలపాకులను ప్రసాదంగా పెట్టండి. తర్వాత దీప, దూప నైవేద్యంతో గణపతిని ఆరాధించి వినాయకుని వ్రత కథను పటించండి.
పూజలో తీసుకోవలసిన జాగ్రత్తలు: ప్రాచీన కాల సంప్రదాయంలో విఘ్నేశుడి పూజ సమయంలో కొన్ని నియమనిష్టలు వహించడం చాలా ప్రధానం. లేదంటే మనిషి శుభ ఫలితాలకు బాహ్యంగా చెడు ఫలితాలను పొందుతాడు. వినాయకుడి పూజలో మర్చిపోయి కూడా తులసి ఆకులను వాడరాదు. అలాగే గణేశుడి పూజలు ఎండిపోయిన, వాడిపోయిన పువ్వులని అస్సలు సమర్పించవద్దు. అలాగే వినాయకుడిని ఆరాధించే శుభ సమయం: శాస్త్రవేత్త రమేష్ శ్యామల చెప్పిన విధానంగా 31 ఆగస్టు 2022న వచ్చే వినాయక చవితి నాడు గజానుని ఆరాధించడానికి అనుకూలమైన సమయం ఉదయం 11: 07 నుండి మధ్యాహ్నం 1:39 తొమ్మిది ఈనాడు గణేశుని పూజ ఉత్సవాలు మొదలయ్యి పదిరోజులపాటు జరగనున్నాయి తరువాత చవితి రోజున ముగుస్తుంది.