Dogs Crying : ఆ సమయంలో కుక్కలు ఏడిస్తే అంతే సంగతులు… జరగరాని ఘోరం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dogs Crying : ఆ సమయంలో కుక్కలు ఏడిస్తే అంతే సంగతులు… జరగరాని ఘోరం…!

 Authored By aruna | The Telugu News | Updated on :8 November 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Dogs Crying : ఆ సమయంలో కుక్కలు ఏడిస్తే అంతే సంగతులు... జరగరాని ఘోరం...!

  •   ఎవరైనా చనిపోయే ముందు కుక్కలు ఏడుస్తాయనేది నిజమేనా..

  •  అసలు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి..

Dogs Crying  : వీధిలో అంతటా నిశ్శబ్దం ఆవహించినప్పుడు కుక్కలు ఏడవడం మొదలు పెడితే అపశకునంగా భావిస్తారు.. అసలు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి.. ఎవరైనా చనిపోయే ముందు కుక్కలు ఏడుస్తాయనేది నిజమేనా.. కుక్కలు ఎందుకు ఏడుస్తాయి.. అవి నిజంగా దెయ్యాలను చూస్తాయా.. ఈ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.కుక్క అనగానే గుర్తొచ్చేది విశ్వాసం. అంతగా విశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచే కుక్క పట్ల మనిషి మూఢవిశ్వాసాన్ని కలిగి ఉండడం అనేది కాస్త ఆశ్చర్యపరిచే విషయమే.. కుక్క ఏడిస్తే ఎవరు చనిపోతారని అనడం వినే ఉంటారు కదా.. మనలో చాలామంది ఈ విషయాన్ని గట్టిగా నమ్మడమే కాదు.. పొరపాటున కుక్క ఏడిస్తే ఏదో జరిగిపోతుందని భయపడిపోతుంటారు.. ఇది ఎంతవరకు నిజం.. కుక్క నిజంగా చావును పసిగడుతుందా.. రాత్రివేళ చిన్న చీకటిలో కొండ కోనల వద్ద దూరంగా ఏదైనా అరుపు వినిపిస్తే అది నక్క అరుపు కావచ్చు.. సినిమాలో ఇలాంటి సన్నివేశాలు భయం పుట్టిస్తాయి.

అయితే ఎక్కడో దూరంగా కాకుండా మన వీధిలోనే రాత్రి సమయంలో ఎక్కువ భయాన్ని కలిగిస్తుంది..ప్రపంచంలోని అనేక సంస్కృతులు కుక్క అరుపు మరణానికి శకునమని నమ్ముతున్నాయి. అమెరికా అలాంటి ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్ ఉన్న దేశం లోని ఈ నమ్మకం ఉంది. యూఎస్ లో రెండు కుక్కలు కలిసి ఏడిస్తే ఎవరైనా ఒక వ్యక్తి మనిషి త్వరలో చనిపోబోతున్నారని నమ్ముతారు. అదే సందర్భాల్లో మూడు కుక్కలు కలిసి ఏడిస్తే ఆ చనిపోయిన వారు ఒక స్త్రీ అని కొందరు నమ్ముతారు. మరి ఇది నిజమేనా.. ఎదగడానికి కారణాలు సైన్స్ జాబితా చేస్తుంది. పురాతన కాలంలో నక్క కుక్క జాతులు పోలి ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.. అలా అరవడానికి కూడా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.. అవేంటంటే సమావేశం నిర్వహించడం కోసం వేట కుక్కలు లేదా నక్కలు వేట ముగిసిన తర్వాత రాత్రివేళ తిరిగి సమావేశం అవుతాయి. రాత్రి చీకటిగా ఉంటుంది. ఏమీ కనిపించదు కాబట్టి వాటి స్థావరాన్ని తమ సహచరులకు తెలిపేందుకు అవి ఒక రకమైన శబ్దం చేస్తాయి. మన సమాజంలో మనతో పాటుగా జీవించే కుక్కలు కూడా ఇందుకోసమే శబ్దం చేస్తాయి.

సరిహద్దుల విభజన రక్షణ యంత్రాంగం మీరు ఎప్పుడైనా గమనిస్తే కుక్కలు గుంపులోకి ఏదైనా కొత్త కుక్క వస్తే అన్ని కలిసి ఆ కొత్త కుక్కపై దాడి చేస్తాయి. దీంతో ఆ కొత్త కుక్క తోక ముడుచుకొని పారిపోతుంది దీని అర్థం. కొన్ని కుక్కలు కలిసి తమకంటూ ఒక ప్రాంతాన్ని ఏర్పరచుకుంటాయి. కొంత పరిధిని కలిగి ఉంటాయి. అవి రాత్రి వేళ ఒక రకమైన శబ్దం చేసి మిగతా కుక్కలకు తెలియపరుస్తాయి. కాకపోతే గాలిలో వచ్చే రసాయనక మార్పులను బట్టి కుక్కలు చాలా తెలుసుకుంటాయంట.. చావుకు దగ్గరగా ఉన్న మనిషి ఆ చుట్టుపక్కల ఉంటే ఆ మార్పులు తెలుసుకునే సామర్థ్యం కుక్కలకుంది అని అంటున్నారు… అంతేకానీ మనిషి ప్రాణం పోతుందని ముందే పసిగట్టే సామర్థ్యం కుక్కలకి లేదని సైన్స్ తెలుపుతుంది…

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది