Dogs : కుక్కలు ఆకాశంలోకి చూసి అరవడానికి కారణాలు ఇవా..
Dogs : మనము పెంచుకొని జంతువులలో తొందరగా మనతో స్నేహం చేసేది. కుక్క మాత్రమే కుక్కకు విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కుక్క ఒక్కసారి మానవునితో స్నేహం చేస్తే అది మరలా మరిచిపోదు. అలా పెంచుకున్న వ్యక్తిని ఒక్కరోజు కూడా : చూడకుండా ఉండలేవు ఆ వ్యక్తి కనిపించేంతవరకు ఆహారం ముట్టదు. అందుకే కుక్కలు చాలా నమ్మకమైన నమ్మదగిన విశ్వాసము గల జంతువుగా పిలవబడుతున్నాయి. కానీ కుక్కలకు ఉన్నటువంటి , పద్ధతులను మార్చుకోవు అటువంటి పద్ధతుల్లో ఒకటి యూరిన్ పోయడం మరొకటి పడుకునే విధానం.
అయితే కుక్కలు పెంపుడు కుక్కలుగా కాక ముందర ఈ కుక్కలు అరణ్య ప్రాంతాల్లో తిరుగుతూ జీవనం సాగించేవి. అడవిలోనే వాటికి కావలసిన ఆహారమును సమకూర్చుకునేవి ఆ అడవిలో వేటాడి సమకూర్చుకున్న ఆహారమును భూమిలో గుంతలు తవ్వి ఆ గుంటలలో దాచుకునేవి. ఆహారము దొరకని పరిస్థితులలో ఆ గుంటలో దాచుకున్న ఆహారము పరిస్థితులకు తగ్గట్టుగా జాగ్రత్తగా తినేవి. మరియు కుక్కలు వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఆ అడవిలో గుంటలు తవ్వి ఆ గుంటలలో పడుకునేవి. కుక్కలు ఈ విధముగా తమ జీవితాన్ని అడవిలో కొనసాగించేవి.
మరియు కుక్కలు తమ తోటి కుక్క లతో కలిసి ఆహారమునకు వెళ్తూ ఉండుటకు, చందమామ కనిపించగానే పెద్దగా అరుస్తూ ఉంటాయి. ఈ కుక్కలు అడవుల నుండి జనాలలోకి వచ్చినంక కూడా వాటి అలవాట్లు పోలేదు కాబట్టి కుక్కలు ఆకాశం వైపు చూస్తూ గుంపులు గుంపులుగా ఏర్పడి పెద్దగా అరుస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఊర కుక్కలు బజార్లలోకి వచ్చి రోడ్లపై ఆకాశం వైపు చూస్తూ అరుస్తూ ఉంటాయి. ఈ విధంగా కుక్కలు అరుస్తూ ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో అనేక రకాల అపోహలకు పోతూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు.