Sankranti Festival : సంక్రాంతి రోజున మర్చిపోయి కూడా ఈ పనులు చేయకండి ..!!
Sankranti Festival : తెలుగువారికి అతిపెద్ద పండుగ సంక్రాంతి. తెల్లవారుజామున లేచి ఇంటి ముందు ఆవుపేడతో కల్లాపి చల్లి రంగవల్లులు దిద్ది గొబ్బెమ్మలు పెడతారు. హరిదాసులు, గంగిరెద్దులవారు, బుడబుక్కలవారు, జంగం వాళ్ళు తమ జానపద కళను ప్రదర్శిస్తారు. ఇంటిల్లిపాది ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండుగకి ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సొంత ఊర్లోకి వచ్చి బంధువులతో సంతోషంగా జరుపుకుంటారు. ఇంటిముందు రంగురంగుల ముగ్గులు గాల్లో ఎగిరే గాలిపటాలు, గుమగుమలాడే పిండి వంటలతో పిల్లల సందడితో పండగ రోజు ఇల్లు కళకళలాడుతుంది.
పండుగ రోజు ఎంత పవిత్రమైన పనులు చేస్తామో అలాగే సంక్రాంతి రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు ఉన్నాయి. సంక్రాంతి పండుగను ఎంతో వైభవం జరుపుకుంటాము. అలాగే ఆరోజు చేయకూడని పనులు కూడా ఉన్నాయి. మకర సంక్రాంతి రోజున ఉదయాన్నే లేచి తల స్నానం చేసి దేవుని ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత ఆహారం సేవించాలి. మర్చిపోయి కూడా తల స్నానం చేయకుండా ఏమి తీసుకోకూడదు. అలాగే పండుగ రోజున మందు సేవించడం, మాంసాహారం తినడం వంటివి చేయకూడదు. సంక్రాంతి రోజున తలస్నానం చేసిన తర్వాత నిల్వ ఉంచిన ఆహారాన్ని తినకూడదు.
ఈ చేయకూడని పనులు చేయడం వలన ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. దీంతో ఇంట్లో సమస్యలు వస్తాయి. అందుకే సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాగే మకర సంక్రాంతి పర్వదినాన ఎవరితోనూ అనవసరంగా గొడవలకు పోవద్దు. ఎవరైనా కావాలని రెచ్చగొట్టిన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అనవసరంగా కోపం తెచ్చుకొని ఘర్షణలకు పోతే ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. దీనివలన మీ ఎదుగుదలకు అడ్డంకులు ఏర్పడతాయి. ఎంతో సంతోషంగా గడిపే సంక్రాంతి రోజున ఎటువంటి ఘర్షణలకు పోకుండా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి. ఇలా సంక్రాంతి రోజున చేయకూడని పనులకు దూరంగా ఉంటే మీకు శుభం కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.