Tulasi Plant : తులసి మొక్కకు నీరు పోసేటప్పుడు ఈ చిన్న మంత్రం చదివితే అఖండ ఐశ్వర్యం…!!
Tulasi Plant : తులసి మొక్కకు పూజ చేయడం హిందూ సాంప్రదాయం. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి సూర్యోదయం కాకమునుపే తులసి మొక్కకు మహిళలు పూజ చేస్తూ ఉంటారు. తులసికి పూజ చేయడం వలన ఆ గృహం సిరిసంపదలతో తులతూగుతుంది. ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఆ ఇంటికి దరిచేరదు. అంతేకాదు తులసి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి దేవితో సమానం. తులసి కోటకు రోజు పూజ చేసి దీపం వెలిగిస్తే ఇంట్లోనే కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉంటారు. ఇక ఇంట్లో తులసి మొక్కను లేదా తులసి కోటను కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశంలో పెట్టాలి.. సాయంకాలం సమయంలో తులసికి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి.
ఉదయం లేదా సాయంత్రం దీపం పెట్టే దీపాన్ని తులసి మొక్కకు కొంచెం దూరంగా ఉంచాలి.. లేదంటే ఆ దీపం వేడికి మొక్క ఆకులు వాడిపోతాయి.. ఇక అపవిత్రంగా ఉన్న సమయంలో అస్సలు తులసి మొక్కకు దూరంగా ఉండాలి.. ఇంట్లో తులసి ఉంటే తప్పకుండా రోజు నీరు పోయాలి. దీపం వెలిగించాలి. ఇలా చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. ఇక రోజు ఉదయం సాయంత్రం రెండు పూటలా తులసి మొక్కకు నీరు పోయాలి. అయితే నీరు పోస్తూ ఓ మంత్రాన్ని చదవాలి. మంత్రం చదువుకుండ నీరు పోస్తే దాని వలన ఎటువంటి ఉపయోగం ఉండదు.. మరి తులసి మొక్కకు నీరు పోస్తూ ఏ మంత్రం చదవాలి..
ఎలా చదవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం… “మహాప్రసాద్ జనని సర్వ సౌభాగ్య వర్ధిని.. హర నిత్య తులసి నమస్తుతే”..ఈ మంత్రాన్ని తులసి మొక్కకు నీరు పోసే సమయంలో తప్పకుండా చదవాలి. ఇక తులసి మొక్కను సాయంత్రం వేళలో ముట్టుకోరాదు.. అంతే కాదు తులసి ఆకులను కూడా సాయంత్రం సమయాలలో కోయరాదు.. అంతే కాదు కొన్ని ప్రత్యేక రోజులలో అంటే ఆదివారం, ద్వాదశి ,ఏకాదశిలో రోజులలో కూడా ఆకులు కోయరాదు…