Solar Eclipse : సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు అస్సలు చేయకండి…!
Solar Eclipse : మన తెలుగు క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 25న అన్ని రాష్ట్రాలలో సూర్యగ్రహణం కనిపించబోతుంది. గ్రహణం మధ్యాహ్నం 2:28 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4:29 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. సాయంత్రం 6:32 గంటల వరకు కొనసాగుతుంది. గ్రహణం ముగిసే వరకు ఆలయాలు మూసి వేయబడతాయి. సూర్యగ్రహణం కారణంగా మతపరమైన ఆచార వ్యవహారాలు ప్రారంభమవుతాయి. చంద్రుడు సూర్యునికి భూమికి మధ్య వెళుతున్నప్పుడు సూర్యుని కిరణాలు భూమిని చేరకుండా అడ్డుకుంటాయి. దీనినే సూర్యగ్రహణం అంటారు. భారతీయ సంస్కృతిలో దీనికి పౌరాణిక జ్యోతిష్య శాస్త్ర సంబంధం ఉంది. పురాణాల ప్రకారం రాహువు అనే రాక్షసుడు సముద్ర మథనం సమయంలో అమృతాన్ని పొందేందుకు దేవుడు రూపంలో వచ్చి చంద్రుడు సూర్యుడు మధ్యలో కూర్చుంటాడు.
విష్ణువు అతనికి అమృతం ఇస్తున్నప్పుడు సూర్యుడు, చంద్రుడు అతను రాక్షసుడు అని చెప్పారు. విష్ణువు వెంటనే రాహువు తలను నరికేశాడు. అప్పటికే విష్ణువు ఇచ్చిన అమృతం ఆ రాక్షసుని కంఠంలోకి వెళ్లిపోయింది. అలా రెండుగా చీలిపోయి ప్రాణాలతో బయటపడ్డాడు. తల భాగాన్ని రాహువు అని శరీర భాగాన్ని కేతువు అని పిలిచేవారు. అప్పటినుంచి రాహు కేతువులకు సూర్యచంద్రులపై పగబడ్డాడని ఆ గ్రహణాల ద్వారా ప్రతీకారం తీర్చుకోవడానికి తరచుగా ప్రయత్నిస్తాడని నమ్ముతారు. గ్రహణం సమయంలో పురాతన కాలం నుండి భారత దేశంలో కొన్ని నియమాలు ఉన్నాయి. సూర్య గ్రహణానికి ముందు మరియు స్నానం చేయాలి. గ్రహణానికి కనీసం రెండు గంటల ముందు ఆహారం తీసుకోవాలి.
సూర్యగ్రహణం సమయంలో ధ్యానం చేయాలి. అలాగే శివుడు, గురువు, విష్ణు స్తోత్రాలను పఠించాలి. చెడు ప్రభావాన్ని నివారించడానికి పవిత్ర తులసి ఆకులను నీటి పాత్రలలో ఉంచాలి. సూర్యగ్రహణం తర్వాత ఇంటిని శుభ్రం చేసి గంగాజలం చల్లాలి. అలాగే సూర్యగ్రహణం సమయంలో సూర్యునికి నేరుగా శరీరం బహిర్గతం కాకుండా ఉంచాలి. గ్రహణ సమయంలో వంట చేయడం, తినడం మానుకోవాలి. సూర్యుడిని కంటితో చూడకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు ఇంటి నుండి బయటకి రాకూడదు. గ్రహణానికి ముందు వండిన ఆహారం తినకూడదు. గ్రహణానికి ముందు నీరు, అన్నం, ఇతర ఆహార పదార్థాలపై తులసి ఆకుల్ని వేయాలి. ఆ సమయంలో నిద్రించడం లేదా బయటికి వెళ్లడం చేయకూడదు.