తూర్పు ఈశాన్యం వీధి పోటు ఇంటికి లాభమా…నష్టమా….!!
మీకు తూర్పు ఈశాన్యం వీధి పోటు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. గృహమునకు తూర్పు ఈశాన్యంకు ఎదురుగా రోడ్డు వచ్చి తగులుతున్నచో దానిని తూర్పు ఈశాన్యం వీధి చూపు అంటారు.. తూర్పు ఈశాన్యం వీధి చూపు పురుషులకు అధికారాలను కలిగిస్తుంది. సమాజంలో ఇంట్లో ఆ ఇంటి యజమానికి గౌరవం హోదా కల్పిస్తుంది. అతని మాటకు విలువ ఉంటుంది. తూర్పు ఈశాన్యం వీధి చూపు కలిగిన ఇంటిలో మగవాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. ఏ రంగంలో పనిచేస్తున్న అంటే ఉద్యోగం కావచ్చు.. వ్యాపారం కావచ్చు.. లేదా ఇక ఏ పనులు చేస్తున్నా వారు పని చేసే చోట వారికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. వారి మాటకు విలువ గౌరవం ఉంటుంది.
ఉదాహరణకు ఒక అధికారికంగా పనిచేస్తున్న ఆ అధికారి ఇతని మాటకు విలువ గౌరవం ఇస్తాడు. వీరి సలహాలు సూచనలు కూడా అధికారి అడుగుతుంటాడు. ఇతరుల కన్నా వీరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. వీధి చూపు వలన ఆ ఇంటిలో నివసించే వారికి వ్యాపారాభివృద్ధి, వంశాభివృద్ధి కలగటం ఉన్నత విద్యావంతుడు కావడం విదేశీ ప్రయాణాలు ధనాభివృద్ధి కీర్తి ప్రతిష్టలు పెరగటం భోగభాగ్యాలు, సుఖసంతోషాలు కలుగుతాయి… ఉన్నతాధికారి కలగటం ఉద్యోగాలలో ప్రమోషన్లు త్వరగా లభించడం జరుగుతుంది. తూర్పు ఈశాన్యం వీధి చూపు కలిగిన ఇంటిలోని వారు ఇంకా బయట పులిలానే ఉంటారు.
ఇలాంటి ఇంటిలోకి వచ్చిన తరువాత పిల్లలు పుడితే వారి పిల్లలు గొప్ప ప్రయోజకులు అవుతారు.. గొప్ప గొప్ప అధికారాలు పదవులు కలుగుతాయి. ఇలాంటి ఇల్లు అద్దెకు దొరికిన అందులో నివాసం ఉండండి మంచి ఫలితాలు వస్తాయి.. అభివృద్ధిలోకి వస్తారు. ఒకవేళ ఇలాంటి ఇల్లు అమ్మకానికి వస్తే ఖరీదు ఎక్కువ అయిన కొనవచ్చు.. ఇలాంటి ఇళ్లలో నివసించేవారు అన్ని రంగాలలో గొప్ప గొప్ప అభివృద్ధి సాధిస్తారు.. చాలా మంచి ఫలితాలు వస్తాయి.. కానీ సామాన్యంగా ఇలాంటి ఇల్లు అమ్మకానికి రావు.. ఎదురుగా గేటు పెడితే ఇంకా అద్భుతమైన మంచి ఫలితాలు వస్తాయి..