Mahalakshmi : మహాలక్ష్మి దేవికి ఇష్టమైన పూలు…. ఈ రకాల పుష్పాలతో పూజిస్తే మీ ఇంట్లో సిరుల పంటలే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahalakshmi : మహాలక్ష్మి దేవికి ఇష్టమైన పూలు…. ఈ రకాల పుష్పాలతో పూజిస్తే మీ ఇంట్లో సిరుల పంటలే…!

 Authored By ramu | The Telugu News | Updated on :15 December 2024,10:00 am

Mahalakshmi  : లక్ష్మీదేవికి ఏ ఏ రకమైన పూలతో పూజలు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో మనం తెలుసుకుందాం… లక్ష్మీదేవి దేవతలలో ధనవంతురాలైన దేవతగా పూజించబడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన పూలతో పూజ చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. ఆమెని ఆరాధించడం వలన శ్రీయస్సు, ధన సమృద్ధి, కుటుంబంలో ఆనందం కలుగుతాయని భక్తుల యొక్క నమ్మకం. అలాగే పూజలో ప్రతి ఒక్క వస్తువు శుభ్రంగా ఉంచాలి. పూలు కూడా తాజాగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే పూల నుంచి వచ్చే పరిమళం పూజకు అధిక శక్తిని ఇస్తుంది. లక్ష్మీదేవి పూజలో ఇష్టమైన పూలను వినియోగించడం భక్తి భావనకు ప్రగాఢం చేస్తుంది. అలాగే శ్రద్ధగా చేసి ఆచరించిన పూలతో చేసిన పూజ అనుకూల ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు. మహాలక్ష్మి దేవికి వివిధ రకాల పూలు ఇష్టం. వాటిలో కొన్ని ప్రత్యేకమైన పూలు ఆమెకు ఎంతో ప్రీతికరమైనవి.

Mahalakshmi మహాలక్ష్మి దేవికి ఇష్టమైన పూలు ఈ రకాల పుష్పాలతో పూజిస్తే మీ ఇంట్లో సిరుల పంటలే

Mahalakshmi : మహాలక్ష్మి దేవికి ఇష్టమైన పూలు…. ఈ రకాల పుష్పాలతో పూజిస్తే మీ ఇంట్లో సిరుల పంటలే…!

Mahalakshmi  లక్ష్మీదేవికి ఇష్టమైన పూలు

తామర పువ్వు : లక్ష్మీదేవి తామర పువ్వు మీద కూర్చొని ఉంటుందని పురాణాలు చెబుతున్నారు. అందుకే తామర పువ్వు లక్ష్మీదేవికి ప్రీతికరమైన పుష్పంగా పరిగణించబడింది. తామర పువ్వు, శుద్ధి,అందం, సంపదకు ప్రతీక.

మందార పువ్వు: మందార పువ్వు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ ఈ మందార మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి నివాసం ఉంటుందంట. ఇంటి సభ్యుల మీద అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు.

గులాబీ పువ్వు : గులాబీ పువ్వులు అందంగా మరియు ప్రేమకు ప్రతీక. ఈ గులాబీల పువ్వులు అర్పించడం వల్ల ఆమెకు అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ గులాబీలు కూడాపరిమళం వెదజల్లుతాయి.

మల్లెపువ్వు : మల్లెపువ్వ శుద్ధి మరియు శాంతికి ప్రతీక. లక్ష్మీదేవి పూజలు మల్లెపూలు ఉపయోగించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
తులసి : తులసి మొక్క అత్యంత పవిత్రమైన మొక్కగా భావిస్తుంటారు. లక్ష్మీదేవి పూజలు తులసి ఆకులను ఉపయోగించడం వల్ల ఆమె అనుగ్రహం తప్పక లభిస్తుందని నమ్ముతుంటారు. ఎందుకంటే తులసీదళం నారాయణునికి ప్రతీక.

పారిజాత పూలు : పారిజాత పూలు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తుంటారు. ఈ పారిజాతం పూలతో పూజించడం ద్వారా దేవి ఆశీర్వాదం త్వరగా లభిస్తుంది. నేరుగా చేతితో కోయవద్దు. నేలపైన పడవద్దు. మరి వీటిని ఎలా కోయాలి అంటే. ఈ పూలను చెట్టు కొమ్మను ఊపి, పైన ఒక బట్టను పరిచి. ఆ పూలు పడే విధంగా చెట్టు కొమ్మను ఊపాలి. ఇలా తెచ్చిన పారిజాత పూలను పూజకు ఉపయోగించాలి.

Mahalakshmi  లక్ష్మీదేవి పూజలు పూల ప్రాముఖ్యత

పూజకు పువ్వు లేనిదే పూజ పూర్తి అయినట్లు కాదు. ఆ పూజ అసంతృప్తిగా ఉంటుంది. పూజలో దేవునికి అర్పించే అత్యంత అందమైన కానుకపుష్పం. ఈ పూలు దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి వినియోగిస్తారు. పూలు శుద్ధి,సాత్వికతకు ప్రతీక. పూజలో పూలు ఉపయోగించడం వల్ల దేవుడి గుడిలో వాతావరణం శుభ్రంగా, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే గృహంలో కూడా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా పూలు శుభానికి ప్రతీక. పూజలో పండ్లతో పాటు పూలను కూడా ఉపయోగించడం వల్ల శుభం కలుగుతుందని నమ్ముతూ ఉంటారు భక్తులు. ఈ పూలు అందానికి ప్రతీక. ఈ పూలు దేవుడి గుడిలో పటాలకు అలంకరణ చేయడం వలన ఆరాధన మరింత అందంగా ఉంటుంది. ఈ పూలు దేవుని పాదాల చెంత సమర్పిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. రకరకాల పూలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండొచ్చు. ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం.

పూలను ఎలా ఉపయోగించాలి పూజ చేసే విధానంలో తాజాగా ఉన్న పుష్పాలనుఉపయోగిస్తూ ఉండాలి.వాడిపోయిన పూలను నలిగిపోయిన పూలను శుభ్రంగా లేని పుష్పాలను ఉపయోగించవద్దు. అలాగే పుష్పాలను నీటితో కడిగి నీటి బిందువులు పుష్పాలపై లేకుండా దేవుళ్ళకి పుష్పాలు సమర్పించాలి. పూలను విగ్రహాలకు అలంకరించడానికి ఉపయోగించవచ్చు. అంతేకాకుండా పూలను నైవేద్యంగా కూడా అర్పించవచ్చు. పువ్వు లేనిదే పూజ లేదు పూజ లేనిదే పువ్వు లేదు.లక్ష్మీదేవి పూజలు పూలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.పూజలను అర్పించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని నమ్ముతారు. అయితే పూజ చేయడం కేవలం కర్మకాండ మాత్రమే కాదు. పూజ ద్వారా మనం మనసు శుద్ధి అవుతుంది, భక్తి పెరుగుతుంది. ఇంట్లో ప్రతిరోజు దీపము పెట్టి రంగు రంగు పూల తోటి పూజలు చేస్తే ఆ మహాలక్ష్మి యొక్క కటాక్షం మన కుటుంబం పై ఎల్లప్పుడూ ఉంటుంది. Favorite flowers of Goddess Mahalakshmi

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది