Mahalakshmi : మహాలక్ష్మి యోజన మొదటి విడత… ఎప్పుడు విడుదల చేస్తారో క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mahalakshmi : మహాలక్ష్మి యోజన మొదటి విడత… ఎప్పుడు విడుదల చేస్తారో క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం…

Mahalakshmi  : తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీ ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తూ వస్తుంది. ఈ తరుణంలోనే ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం , గృహ జ్యోతి , 10 లక్షల భీమా పెంపు వంటి గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది. ఇక ఈ 6 గ్యారెంటీలకు […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 April 2024,3:30 pm

Mahalakshmi  : తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీ ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తూ వస్తుంది. ఈ తరుణంలోనే ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం , గృహ జ్యోతి , 10 లక్షల భీమా పెంపు వంటి గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది. ఇక ఈ 6 గ్యారెంటీలకు ప్రజాపాలన అప్లికేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. అయితే ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ లో ఉండటం వలన అప్లికేషన్స్ డేటాను త్వరలోనే డిజిటలైజ్ చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రజాపాలన అప్లికేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించిన సమయంలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ సర్కార్ 3 ప్రయోజనాలను ప్రకటించారు. వాటిలో మొదటిది తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం. అయితే ఇప్పటికే ఈ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం జరిగింది. ఇక రెండవది అర్హులైన మహిళలందరికీ 500 కి గ్యాస్ సిలిండర్లు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు 500 కి గ్యాస్ సిలిండర్లను ఇచ్చే ప్రక్రియను కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది.

ఇక ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలవారి నగదు సాయం కింద రూ.2500 ఇవ్వనున్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందించనున్న 2500 ఆర్థిక సహాయం ఎన్నికల ముగిసిన తర్వాత అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అర్హులైన తెలంగాణ మహిళలందరూ కూడా నెలకు 2500 పొందుతారు.

అయితే ప్రజా పాలన దరఖాస్తులలో మహాలక్ష్మి పథకానికి వచ్చిన దరఖాస్తులు అధిక సంఖ్యలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ దరఖాస్తులకు సంబంధించిన డేటా ఎంట్రీ ఇప్పటికే పూర్తి కాగా…దాదాపు 91.49 లక్షల మంది మహిళలకు 500 కి గ్యాస్ సిలిండర్లు , 92.23 లక్షల మంది మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2500 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇక ఈ అప్లికేషన్లకు సంబంధించి డేటా ఎంట్రీ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారి దరఖాస్తు స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తు వివరాలు డిజిటల్ అయ్యాయో లేదో అనే వివరాలను తనిఖీ చేసుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కావున ఆన్ లైన్ లో మీ దరఖాస్తును తనిఖీ చేసుకొని వివరాలు సరిగా లేకుంటే వాటిని సరి చేసుకోవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది