Garuda Puranam : ఆడపిల్ల పుట్టడానికి దేవుడు మీ ఇంటిని ఎందుకు ఎంచుకుంటాడో తెలుసా…!!
Garuda Puranam : ఆడపిల్ల పుడితే ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఆ ఇంట్లో వారు అందరూ మా ఇంట్లో మగపిల్లాడి పుడితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. పూర్వం నుండి మనది పురుషాధిక్య సమాజం. దానికి తగ్గట్టుగానే మన ఆలోచనలు ఉంటాయి. ఆడ పిల్ల పుడితే మైనస్ అని, అదే మగ పిల్లాడు పుడితే ప్లస్ అని ఈ రోజులలో కూడా చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే ఆడపిల్ల ను గుండెల మీద కుంపటి అనుకుంటూ ఉంటారు. కానీ కేవలం అదృష్టవంతులకు మాత్రమే ఆడపిల్ల పుడుతుంది అని తేలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఆడపిల్ల ఆ ఇంట్లో పుట్టలంటే పెట్టి పుట్టుండలంట. పూర్వ జన్మలో పుణ్య కార్యక్రమాలు చేసిన వారి ఇంట్లో మాత్రమే ఆడపిల్ల పుడుతుంది అని మన శాస్త్రాలలో చెప్పబడ్డాయి. గత జన్మలో వారు చేసిన దాన ధర్మాలు, సత్ కర్మలు ఆధారంగా ఈ జన్మలో వారిని ఉద్ధరించడానికి ఆ ఇంట్లో వారికి ఆడపిల్ల పుడుతుంది. మనము ఆడపిల్లలకు మంచి సంబంధం చూసి సుఖ పడే ఇంట్లోకి ఎలా అయితే పంపిస్తామో అలాగే బ్రహ్మదేవుడు కూడా ఆడపిల్లను మురుపెంగ పెంచగలిగే వారింట్లో నే పుట్టిస్తాడట. ఒకానొక టైంలో శ్రీకృష్ణుడు దగ్గరకు వచ్చిన ద్రౌపతి ఎలాంటి వారింట్లో ఆడపిల్ల జన్మిస్తుంది. ఆడపిల్లలను కనాలంటే తల్లిదండ్రులు ఎలాంటి కార్యాలు చేయాలో చెప్పమని ద్రౌపతి అడుగుతుంది. దానికి శ్రీకృష్ణుడు ద్రౌపతి తో గత జన్మలో ఎవరైతే పుణ్యం చేసుకుంటారో వారే ఆడపిల్లలకు జన్మనిస్తారు… ఆడపిల్లలను అందరూ పెంచలేరు, దానికి చాలా ఓర్పు, సహనం అవసరం. ప్రతి ఒక్కరు ఎలాగైతే వజ్రభరణాలను కొనలేరో, అలాగే ఆడపిల్లలను పెంచి పోషించలేరు.
దానికి చాలా నేర్పు ఉండాలంట.సృష్టికి మూలం స్త్రీ. ఆడది అమ్మగా మారటానికి తన సర్వస్వాన్ని అర్పిస్తుంది. తన కడుపులో పెరుగుతున్న ఆ ఇంటి వంశం కురాలిని 9 నెలలు పాటు మోసి ఎంత కష్టమైనా సరే పురిటి నొప్పులను భరించి ఆ ఇంట్లో ఆనందాన్ని ఇస్తుంది స్త్రీ మూర్తి. మగవాడు కేవలం తన వంశాన్ని మాత్రమే ఉద్ధరిస్తే ఆడపిల్ల మాత్రం అటు పుట్టింటిలోనూ,ఇటు మెట్టింట్లోను వెలుగులను నింపుతుంది. ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఆడపిల్ల జన్మించటం ఆగిపోతుందో అప్పటి నుండి ఈ మానవాళి మొత్తం అంతరించిపోవటం మొదలవుతుంది. స్త్రీ శక్తి అసామాన్యం. ఆమె ఎన్ని కష్టాలైనా పంటి బిగువున భరిస్తుంది. ఎన్ని పనులు ఉన్నా సరే ఒంటి చేత్తో విసుగు లేకుండా చేస్తుంది. కార్యేషు దాసి కరణేషు మంత్రి బోజేసు మాత రూపేష్ లక్ష్మి శయనేషు రంభ సమయ దరిద్రి అన్నారు మన పెద్దలు. అంటే పనిలో దాసిగా, సలహా ఇవ్వటంలో మంత్రిగా, భోజనం పెట్టటంలో తల్లిగా, అందంలో లక్ష్మిగా పడక గదిలో రంభగా క్షమించటంలో భూదేవిగా స్త్రీ అనేక రకాల పాత్రలు పోషిస్తుంది అని అర్థం. ఎక్కడైతే మహిళలను గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. స్త్రీకి భూదేవికి ఉన్నంత ఓర్పును ఇచ్చాడు ఆ దేవుడు. భర్త ఎలాంటి వాడైనా ఇంటి విషయాలు బజారున పడకుండా ఓర్పుతో, నేర్పుతో కష్టాలన్నింటినీ పంటి బిగువున భరిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది స్త్రీ మూర్తి. ఒక కుటుంబం సమాజంలో ఉన్నతంగా ఎదిగింది అంటే దాని వెనక స్త్రీ పాత్ర చాలా ఉంటుంది. భార్యగా,అత్తగా, కుమార్తెగా, అక్కగా, చెల్లిగా, నాయనమ్మగా, స్త్రీ కుటుంబంలో అనేక పాత్రలు పోషిస్తూ తన బాధ్యతను నిర్వర్తిస్తుంది. స్త్రీ శారీరక శక్తిలో పురుషుడు కన్నా బలహీనురాలు అయినప్పటికీ మానసిక శక్తిలో మాత్రం ఆమె కు ఎవరు సాటి లేరు. మగవారి కన్నా ఆడవారికి కసి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటాయి. వారిని సరిగ్గా ప్రోత్సహించాలే గాని ఏదైనా సాధించగలుగుతారు. పోటీ పరీక్షల్లో మగవారి కంటే ఆడవారికే ఎక్కువ ర్యాంకులు రావడం మనం గమనించొచ్చు.
కాకపోతే ఆడపిల్ల ఒక వయసుకు రాగానే తల్లిదండ్రులు ఆమెలో ఎంత నైపుణ్యం ఉన్న సరే దానిని నొక్కి పట్టి ఆమెను ఒక అయ్య చేతిలో పెట్టి చేతులు దులిపేసుకుంటారు. అంతటితో ఆమెకు ఉన్న నైపుణ్యం మొత్తం మరుగున పడిపోతుంది. ఎక్కడో నుటికొ కోటికో భార్య అభివృద్ధి భర్త గౌరవిస్తే తప్ప ఆమె నైపుణ్యం మొత్తం అలా చీకట్లోనే మగ్గిపోతుంది. ఈ విషయం లో ప్రస్తుత సమాజంలో మార్పు వస్తున్న ఇంకా చాలా రావాల్సి ఉంది… ఆడపిల్ల ను కన్నప్పుడు తల్లిదండ్రులకు ఎంతటి పుణ్యం లభిస్తుందో. ఆమెకు కన్యధారం చేసి ఒక అయ్య చేతులో పెట్టినప్పుడు అంతకంటే రెట్టింపు ఆనందం లభిస్తుంది. అన్ని దానాలలో కంటే కన్యాదానం విశిష్టమైనది. ఎంతో విశిష్టమైన కన్య దానాన్ని ఇచ్చారు మన పెద్దవారు. కన్యాదానం చేసిన తల్లిదండ్రులకు ఎంతో పుణ్యం లభిస్తుందని శాస్త్రాలలో చెప్పబడింది. పెళ్లి సమయంలో కూతురిని ఇచ్చి పుచ్చుకుంటుండగా ఇప్పటివరకు నా కూతురిని పోషించి ఆమె బాధ్యతను నిర్వర్తించాను. ఈరోజు నుండి నా కూతుర్ని నీకు అప్పగిస్తున్నాను అని కన్యధాత చెపుతూ అల్లుడి వద్ద నుండి కొన్ని ప్రమాణాలు అడుగుతాడు. ధర్మం నందు ఆమెను అతిక్రమించకూడదు అని అడిగితే వరుడు దానికి అంగీకరిస్తాడు. ధర్మం నందు అతిక్రమించనని ప్రమాణం చేస్తాడు. అర్థము నందు నీవు ఆమెను అతిక్రమించకూడదు. నీవు ఇప్పటివరకు ఎంత అయితే సంపాదించావో ఇక ముందు సంపాదించబోయేదంతా దానికి ఈవిడ సర్వాధికారిని ఒప్పుకుంటావా అని అడిగితే దానికి కూడా వరుడు అంగీకారం చెబుతాడు.నీ మనసులో కామం కలిగితే నీకు మా బిడ్డ గుర్తుకు రావాలి. నా కూతురు ద్వారానే నీవు సంతానాన్ని పొందాలి. ఈ అర్హత ఇంకొకరికి ఇవ్వటానికి వీలు లేదు,అనగానే దానికి కూడా వరుడు అంగీకారం చెబుతాడు. ఇప్పటివరకు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురు అతని వద్ద భద్రంగా ఉంటుంది అని నమ్మకం కలిగిన తరువాత కన్యదాత అల్లుడి దగ్గర ప్రమాణం తీసుకొని తన కూతురును అప్పగిస్తాడు…!!