Chanakya Niti : చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు.. పాటిస్తే జీవితంలో విజయం మీదే..
Chanakya Niti : ప్రతీ ఒక్కరు జీవితంలో విజయం సాధించాలని అనుకుంటారు. కానీ, అందుకు అనుసరించాల్సిన పద్ధతులు తెలియక ఫెయిల్ అవుతుంటారని పెద్దలు చెప్తుంటారు. అది నిజం కూడా. లక్ష్యం నిర్దేశించుకుంటే సరిపోదు. దాని సాధనకు కష్టపడాలి. ఆచార్య చాణక్యుడు చెప్పినట్లు ఈ సూత్రాలు ఫాలో అయితే జీవితంలో మీరు అనుకున్న లక్ష్యం చేరువ కావడంతో పాటు విజయం ఎప్పుడూ మిమ్మల్ని వరిస్తుంది. కాగా, చాణక్యుడు చెప్పిన ఆ నీతి సూత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఆచార్య చాణక్యుడు జీవితంలో ఎదురయ్యే సమస్యలు, సవాళ్ల గురించి ఎప్పుడో విశ్లేషించాడు. వాటన్నిటినీ గురించి వివరించేందుకుగాను ఆయన నీతి శాస్త్రం పేరిట గ్రంథం కూడా రచించాడు.
అలా ఆచార్య చాణక్యుడు చెప్పిన విషయాలతో కూడిన నీతి శాస్త్రాన్ని చదివితే చాలు.. మీ జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాలు సాకారం చేసుకోవచ్చు. ఆ ఐదు లక్ష్యాలు ఏమింటంటే..క్రమశిక్షణ.. ప్రతీ ఒక్కరి జీవితంలో సక్సెస్ అవడం, కాకపోవడం అనేది డిసైడ్ చేసేది ఈ ఫ్యాక్టర్ అని చాణక్యుడు పేర్కొన్నాడు. క్రమశిక్షణ లేని వ్యక్తి తన జీవితంలో ఎటువంటి పనులు చేయలేడని, విజయం సాధించలేడని వివరించాడు చాణక్యుడు.ఇకపోతే మనిషి విజయం కోసం అదృష్టాన్ని కాకుండా కర్మను నమ్మి.. చిత్తశుద్ధితో పని చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే మీకు విజయాలు వస్తాయి. రిస్క్ తీసుకోవడానికి భయపడకూడదు. అలా భయపడితే జీవితంలో ఎప్పుడూ ముందుకు సాగలేం.
Chanakya Niti : ఈ విషయాలపై పట్టు సాధిస్తే లక్ష్యం మీ దరికి చేరునుగాక..
ఏదేని పని మొదలు పెట్టే ముందర క్షుణ్ణంగా పరిశీలన చేయడం ముఖ్యం. పరిశీలన తర్వాతనే విషయంపై అంచనాకు వచ్చి ముందుకు సాగాలి. మీరు ఆశించిన ఫలితం రాకపోతే చింతించాల్సిన అవసరం లేదు. మీ ఎఫర్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ పెడితే చాలు. ఇకపోతే జీవితంలో విజయం సాధించాలంటే, మీతో పాటు కొంత మంది నమ్మకమైన వ్యక్తులను ఎప్పుడూ తోడుగా ఉంచుకోవాలి. అలా అయితేనే మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. మీరు అందరితోనూ కలిసి పని చేసే గుణం కలిగి ఉండాలి. అదే నాయకుడి లక్షణం కూడా. ఏదేని డెసిషన్ తీసుకునే ముందర ఎందుకు ఈ పని చేస్తున్నాను? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి.? నమ్మకమైన సమాధానాలు వస్తేనే ముందుకు సాగాలి.