Karthika Masam : కార్తీక మాసంలో ఈ పరిహారాలు పాటిస్తే లక్ష్మి అనుగ్రహం పొందినట్లే… కుభేరులవుతారు…!
ప్రధానాంశాలు:
Karthika Masam : కార్తీక మాసంలో ఈ పరిహారాలు పాటిస్తే లక్ష్మి అనుగ్రహం పొందినట్లే... కుభేరులవుతారు...!
Karthika Masam : హైందవంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన కార్తీకమాసం ప్రారంభమైంది. అయితే ప్రతి ఏడాది దీపావళి అమావాస్య ముగిసిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఇక పెద్దలు ఈ మాసాన్ని శివ కేశవులకు ప్రత్యర్థ ప్రీతికరమైనది గా చెబుతారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే.. ఎనిమిదో నెల లో చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కాబట్టి దీనికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. అయితే కార్తీకమాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కార్తీక మాసంలో నది సముద్ర స్నానాలు, వన భోజనాలు వంటివి ఈనెల అంతా కనిపిస్తాయి. ఇందులో అత్యంత శుభప్రదమైన నోములు వ్రతాలు కూడా ఉంటాయి. ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో కొన్ని పనులు చేయడం వలన ఆకస్మిత ధన నష్టం సంభవిస్తుంది. కాబట్టి ఈ మాసంలో కొన్ని ఆచారాలను పాటించడం మంచిది. మరి ఏ పనులు చేయడం వలన ఆకస్మిత ధన నష్టం సంభవిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
– ఈ నేపథ్యంలోనే కార్తీక మాసంలో ఏకాదశి సోమ శనివారాలలో స్త్రీలు ఉపవాసాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక భక్తులు ఈ రోజుల్లో తెల్లవారుజామున మరియు సాయంత్రం వేళలో ఆలయాలలో దీపాలను వెలిగిస్తారు. అలాగే తులసి చెట్టుకి ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తారు. గోవులను కూడా పూజిస్తారు. ముఖ్యంగా ఈ మాసంలో పరమశివుడికి ఆవుపాలతో అభిషేకించి జాజిపూలతో పూజిస్తే శివ స్థానాన్ని పొందుతారని నమ్మకం.
– ఈ పవిత్రమైన కార్తీక మాసాలలో నదులలో పుణ్యస్నానాలను ఆచరించడం మరియు దైవదర్శనాలు చేసుకోవడం వలన విశేషమైన ఫలితం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇక ఈ మాసంలో కార్తీక పురాణాల్లో ఉండే 30 అధ్యాయాలను రోజుకి ఒకటి చొప్పున పారాయణం చేయడం ఎంతో శుభప్రదం.
– కార్తిక మాసంలో ఆహారం నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఈ సమయంలో మాంసాహారం తీసుకోకూడదని ఆధ్యాత్మిక వేతన చెబుతున్నారు. ఎందుకంటే ప్రతి ఆదివారం స్తప్తమి రోజున ఆహారంలో ఉసిరిని వినియోగించకూడదు. అదేవిధంగా అష్టమి నాడు కొబ్బరిని వాడకూడదు. వీటివల్ల ఆకస్మిత ధన నష్టం ఉంటుందని ప్రగాఢ విశ్వాసం.
– కార్తీక మాసంలో భక్తులు ఈ నెల రోజుల పాటు ఆలయాలను సందర్శించుకుంటారు. అలాగే ఈ మాసంలో అయ్యప్ప స్వామి భక్తులు మాలధారణ చేస్తారు. ఇక శ్రీకాళహస్తి , శ్రీశైలం ,శైమ క్షేత్రాలన్నీ కార్తీక శోభనం సంతరించుకుంటాయి. ఈ మాసం మొత్తం భక్తులతో పోటెత్తుతుంటాయి. అలాగే ఉజ్జయినీ వారణాసి వంటి ఇతర ఆలయాలన్నిటిని కూడా భక్తులు ఈ సమయంలో దర్శించుకుంటారు.