Garuda Purana : చనిపోయిన వ్యక్తిని ఒంటరిగా ఎందుకు వదలకూడదో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Garuda Purana : చనిపోయిన వ్యక్తిని ఒంటరిగా ఎందుకు వదలకూడదో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :3 April 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Garuda Purana : చనిపోయిన వ్యక్తిని ఒంటరిగా ఎందుకు వదలకూడదో తెలుసా...?

Garuda Purana : హిందూ ధర్మంలో ఎవరైనా సూర్యుడు అస్తమించిన తర్వాత చనిపోతే ఆ శవాన్ని రాత్రంతా ఇంటి దగ్గరే ఉంచుతారు. ఆ తర్వాత రోజు ఆ శవానికి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఇదే కాకుండా ఎవరైనా పంచక సమయాన్ని చనిపోతే వాళ్ల శవాని కూడా కొంత సమయం వరకు ఇంటి దగ్గర ఉంచుతారు. ఎప్పుడైతే పంచ సమయం వస్తుందో ఆ తర్వాత దాన సంస్కారాలు నిర్వహిస్తారు. గరుడ పురాణంలో చెప్పిన ప్రకారం సూర్యాస్తమయం తర్వాత పంచ సమయంలో ఎవరైనా దాన సంస్కారాలు నిర్వహిస్తే వాళ్లకి మోక్షం ప్రాప్తించదని చెప్పబడింది. అందుకనే ఎవరైనా రాత్రి చనిపోతే దాన సంస్కారాలు నిర్వహించకుండా శవాన్ని ఇంటి దగ్గరే ఉంచుతారు. ఉదయం వరకు వేచి ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో శవాన్ని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలరు. ఎవరో ఒక వ్యక్తి అయినా ఎల్లప్పుడూ శవం దగ్గరే కాపలా ఉంటారు. ఒకవేళ శవాన్ని ఒంటరిగా వదిలేస్తే ఏదైనా కుక్కపిల్ల లాంటి జంతువులు వచ్చి శవాన్ని తింటాయని ఇలా చేస్తారు.

అలానే గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వారి ఆత్మ యమలోకంలోకి ప్రవేశించడానికి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో పాటు శవాన్ని ఒంటరిగా వదిలేస్తే దాన్నుంచి దుర్వాసన వస్తుందని కూడా భావిస్తారు. అందుకని శవం దగ్గర ఎవరో ఒక వ్యక్తి అయినా ఉండాలని భావిస్తారు. దీనితో పాటు శవం చుట్టూ నలువైపులా అగరబత్తులు కూడా ఉంచుతారు. దీని ద్వారా శవం నుంచి వెలువడ దుర్వాసన తగ్గిపోతుంది. గరుడ పురాణం ప్రకారం విష్ణు భగవానుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఇలా అంటాడు. పక్షిరాజా ఈ పరిస్థితులతో పాటు ఎవరైనా చనిపోతే వారి సంతానం ఇంటి దగ్గర లేకపోతే అలాంటి పరిస్థితుల్లో కూడా శవాన్ని ఇంటి దగ్గర ఉంచుకోవచ్చు అని చెప్తాడు. ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే చనిపోయిన వ్యక్తి కొడుకు కానీ కూతురు కానీ వచ్చి చివరి చూపు చూడాలని ఇలా చేస్తారు.  లేకపోతే ఆత్మకూ శాంతి చేకూరకుండా ఈ ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటుంది. దీంతోపాటు విష్ణు భగవానుడు ఏమంటాడంటే ఒకవేళ ఎవరైనా సూర్యుడు అస్తమించిన తర్వాత చనిపోతే వారి అంతిమ సంస్కారాలు ఆరోజు నిర్వహిస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మ అసుర దానవ రాక్షసుల రాజ్యంలో జన్మిస్తుంది అని చెప్తాడు.

అక్కడ ఆత్మకి చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఈ కారణం చేతనే హిందూ ధర్మంలో రాత్రిపూట దాన సంస్కారాలు చేయడం నిషేధించబడింది. దీంతో పాటు రాత్రిపూట శవాన్ని ఒంటరిగా వదిలేస్తే ఆ శవం యొక్క శరీరంలో చుట్టుపక్కల తిరుగుతున్న దుష్టశక్తులు కూడా ప్రవేశించే అవకాశం ఉంటుంది. వాళ్ళు భయంకరమైన గొంతుతో ఇక్కడి నుంచి వెళ్లాల్సిన సమయం వచ్చిందని చెప్తారు. ఆత్మ తన జీవితంలో చేసిన పనులను బట్టి యమదూతలు ఆత్మను తీసుకొని యమలోకానికి వెళ్తారు. కర్మ మరియు పునర్జన్మ ఆత్మ చివరి వరకు ఉద్దన ప్రపంచాన్ని చూస్తూ.. ఎలాంటి లోకానికి వెళుతుందంటే అక్కడ సూర్యుడు వెలుగు ఉండదు. చంద్రుడి వెన్నెల ఉండదు. ఆ లోకంలో నలువైపులా చీకటే ఉంటుంది. ఈ మార్గంలో ఆత్మకి కొంత సమయం విశ్రాంతి లభిస్తుంది. కొన్ని ఆత్మలు తప్పు చేసిన మంచి పనులకు వెంటనే జన్మిస్తాయి. కొన్ని ఆత్మలు దీర్ఘకాలిక విరమం తీసుకున్న తర్వాత భూమిపై మళ్ళీ జన్మిస్తాయి…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది