Guptha Varahi : జులై 6 నుండి గుప్త వారాహి నవరాత్రులు… ఆ సమయంలో ఇలా చేస్తే అన్ని శుభ ఫలితాలు….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Guptha Varahi : జులై 6 నుండి గుప్త వారాహి నవరాత్రులు… ఆ సమయంలో ఇలా చేస్తే అన్ని శుభ ఫలితాలు….!

 Authored By ramu | The Telugu News | Updated on :6 July 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Guptha Varahi : జులై 6 నుండి గుప్త వారాహి నవరాత్రులు... ఆ సమయంలో ఇలా చేస్తే అన్ని శుభ ఫలితాలు....!

Guptha Varahi  : జులై 6వ తారీకు నుంచి 15 వరకు శ్రీ దేవి ఆషాడ వారాహి నవరాత్రులు ఉంటాయి. అయితే ఈ వారాహి నవరాత్రి చాలా విశేషమైనవి. వీటిని గుప్త నవ రాత్రులు గా ఆచరణ చేస్తూ ఉంటారు. అమ్మవారికి గుప్త నవరాత్రులు చేసినటువంటి ఆరాధన లక్ష్యంతుల ఫలితాన్ని ఇస్తుందని పండితులు అంటారు. అయితే అసలు వారాహి అమ్మవారిని ఎందుకు ఆరాధన చేయాలి..? వారాహి అమ్మవారికి మరియు ఆశాడానికి ఉన్న విశిష్టత ఏమిటి….? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో భూసంబద్ధతమైన వ్యవహారాలన్నీ అనుకూలిస్తాయి. గుప్తంగా చేసిన ఏ పూజ అయిన , ఏ దానమైన అత్యంత ఫలితాలను ఇస్తాయి. అయితే గుప్త వారాహి నవరాత్రులు అనేవి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది. అలాగే అనేక సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ సమస్యలను నుండి విముక్తి చేసుకోవడానికి అమ్మవారి ఆరాధన చేసుకోవాలి అని దేవి భాగవతంలో ఉంది. అయితే వారాహి అమ్మవారు భూమిని మొస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. కుటుంబ సమస్యలు భూతగాదాలు కోర్టు వ్యవహారాలు గాని ఉన్నట్లయితే వారాహి నవరాత్రులను ఆచరించడం వలన ఈ సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. అలాగే దక్షిణాది ప్రదేశాలలో ఈ నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. ఉపాసకులు గాని మంత్రగస్తులు ప్రత్యేకమైన శ్రద్ధ ని తీసుకుని దేవి ఆరాధన చేస్తూ ఉంటారు. ఇందులో ఉదయం విశేషమా మధ్యాహ్నం విశేషమా రాత్రి విశేషమా అంటే ఈ కాలమంతా కూడా విశేషమే అని చెప్పుకోవచ్చు. కానీ పురాణల ప్రకారం ప్రధొష కాలం విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రదోషకాలం వరకు ఉపవాసం ఉండవచ్చు.

Guptha Varahi జులై 6 నుండి గుప్త వారాహి నవరాత్రులు ఆ సమయంలో ఇలా చేస్తే అన్ని శుభ ఫలితాలు

Guptha Varahi : జులై 6 నుండి గుప్త వారాహి నవరాత్రులు… ఆ సమయంలో ఇలా చేస్తే అన్ని శుభ ఫలితాలు….!

ప్రదోషకాలం వరకు ఉపవాసం ఉండి చేయాలి కాబట్టి అవి కొంతమందికి ఇబ్బంది కావచ్చు. స్వదర్భంగా చేసుకునే వారికి ప్రదోలం చాలా విశేషం. ఒకవేళ అందరూ కలిసి చేయాలి అనుకుంటే సూర్యోదయం అయిన తర్వాత ఒకటవ జాము నుంచి మూడవ జాము వరకు చేయడం విశేషమైనది. అలాగే ధర్మరక్షణలో భాగంగా మనం ఆచరణ చేసుకుంటూ ఉండాలి. గుప్త నవరాత్రులలో కూడా లోక కళ్యాణార్థం చేయవచ్చు. స్వార్థం కోసం కాకుండా సర్వము కూడా సుభిక్షం కోసం చేయవచ్చు. ఇలా చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది