Chintamani Ganapati : కోరిన కోరికలు తీర్చే చింతామణి గణపతి… ఎక్కడంటే…
Chintamani Ganapati : చింతామణి గణపతి విదర్భ ప్రజల ఆరాధ్య దేవుడు. భక్తులు చింతలు తీరస్తు వారికి చింతామణి గణపతి గా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయం పూణే జిల్లా హవేలీ తాలుకాలోని ధేవూర్ లో వెలిసింది. చింతామణి గుడి యావత్మాల్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో కలాంబ్ వద్ద ఉంది. ఈ గణపతిని వేల సంవత్సరాల క్రితం స్థాపించబడిందని నమ్ముతారు. గణపతి విగ్రహాన్ని ఇంద్రుడు స్వయంగా ప్రతిష్టించాడని కూడా చెబుతారు. అందుకే ప్రతి 12 నెలలకు ఒకసారి వినాయకుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతారు. ఇక్కడి సరస్సులు శ్రీ చింతామణి దేవాలయం స్థాపించబడింది. ఇది పురాతన దేవాలయం. భూమి నుండి దాదాపు 30 అడుగుల లోతులో ఉంది. ఆలయానికి మూడు వైపులా ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ప్రధాన ద్వారంలోని నాలుగు ముఖాల వినాయక విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహం రాతితో చెక్కబడింది. విగ్రహం చేతులు కలిపి ఉన్నాయి.
ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ గంగ దిగి వస్తుందంట. దీని వెనుక ఒక కథ ఉందంటున్నారు భక్తులు. దేవతల రాజు ఇంద్రుడు గౌతమ ఋషి భార్యను ఇష్టపడతాడు. దాంతో గౌతమ ఋషి అతన్ని శపిస్తాడు. ఆ తర్వాత ఇంద్రుడు భయంతో తామర పువ్వు చాటున దాక్కుంటాడు. ఈ విషయం తెలుసుకున్న దేవతలందరూ గౌతముడిని శాంతించమని కోరుతారు. తనను క్షమించమని కోరుకుంటారు. కానీ గౌతముడు అందుకు అంగీకరించారు. అయితే చింతామణి తపస్సు తర్వాతనే ఇంద్రుడు రక్షింపబడతాడని ఉపశమనం చెబుతాడు. ఈ క్రమంలోనే గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంద్రుడికి ఓ మంత్రం ఇచ్చాడు. బృహస్పతి ఇంద్రుడిని తామరకాండము నుండి బయటకు తీశాడు.
దీని తర్వాత ఇక్కడ సరస్సులో స్నానం చేయాలని సూచిస్తాడు. అతను వెయ్యి సంవత్సరాల తపస్సు చేసిన తర్వాత శ్రీ చింతామణి అతన్ని ప్రసన్నం చేసుకుంది. వరం అడగమని చింతామణి కోరింది. అందుకు ఇంద్రుడు ఓ దేవా నేను నిన్ను మరిచిపోకుండా ఉండేలా ఈ కదంబ వృక్షం వద్దే ఓ నగరాన్ని స్థాపించు, అలాగే నేను స్నానం చేసిన సరస్సుకి చింతామణి సరస్సు అని పేరు పెట్టాలి. ఈ సరస్సులో స్నానం ఆచరిస్తే కోరికలన్నీ నెరవేరేలా వరం కోరుతాడు. అందుకు ఇంద్రుడు స్వర్గం నుండి గంగను పిలిచాడు. శ్రీ చింతామణికి స్నానం చేసి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ ప్రాంతానికి రావాలని ఆజ్ఞాపించారు. ఆ తర్వాత ప్రతి పుష్కర కాలానికి గంగ ఇక్కడికి వస్తుంది. అప్పుడే ఇంద్రుడు ఇక్కడ రెండు అడుగులు ఎత్తైన అందమైన స్పటిక గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అదే నేటికీ భక్తులచే పూజలు అందుకుంటున్న చింతామణి గణపతి విగ్రహం అని చెబుతారు.