మహాకాలేశ్వర జ్యోతిర్లింగం విశేషాలు ఇవే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

మహాకాలేశ్వర జ్యోతిర్లింగం విశేషాలు ఇవే !

 Authored By keshava | The Telugu News | Updated on :6 March 2021,6:00 am

Mahakaleshwar Jyotirlinga Temple : మహాకాలేశ్వరుడు.. జ్యోతిర్లింగాలలో విశేషమైనది. ప్రతీరోజు అప్పుడు దహనం చేసిన శవభస్మాన్ని తెచ్చి భస్మాభిషేకం చేసే పవిత్రమైన స్థలం. పరమేశ్వరునికి అత్యంత ఇష్టం. ఈ భూమిపైనున్న సిద్ధక్షేత్రాలలో నైమిశారణ్యం – పుష్కరం – కురుక్షేత్రం ముఖ్యమైనవి. కురుక్షేత్రం కంటే పదిరెట్లు కాశీ పుణ్యప్రదమైనది. కాశీ కంటే మహాకాలవనం పదిరెట్లు గొప్పది. తీర్థాలలో అత్యుత్తమైనది ప్రభాసం – శ్రీశైలం – దారుకావనం. వీటన్నిటికంటే మహాకాలవనం గొప్పది. ఎందుకంటే, స్మశానం – ఏడారి – పొలం – పీఠం – అరణ్యం అంటూ ఐదు ఉన్న ప్రదేశం ఉజ్జయిని.
పురాణగాథ

Mahakaleshwar Jyotirlinga Temple

Mahakaleshwar Jyotirlinga Temple

పూర్వం వేదప్రియుడనే శివభక్తునికి దేవ ప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, ధర్మవాహి అనే నలుగురు కుమారులుండే వారు. ఈ నలుగురు కూడ శివభాక్తులే. ఇదే సమయంలో ఇక్కడ దగ్గరలోని రత్నమాల పర్వతంపై నివసిస్తున్న దూషణా సురుడనే రాక్షసుడు, వీరి పూజలకు ఆటంకాన్ని కలిగిస్తూ, అందరినీ హింసిస్తూ ఉండేవాడు. ఆ రాక్ససుని బాధలను తట్టుకోలేని అన్నదమ్ములు పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించాగా, శివుడు మహాకాలుడై ఆవిర్భవించి, దూషణాసురుని, అతని సైన్యాన్ని భస్మం చేసాడు. అప్పట్నుంచి ఉజ్జయినీ నగరంలో విలసిల్లుతున్న మహాకాలేశ్వరుడు త్రిభువన లింగాలలో ప్రసిద్ధునిగా వెలుగొందుతున్నాడు.

Mahakaleshwar Jyotirlinga Temple : అష్ఠాదశ పీఠం :

ఇక్కడ శక్తిపీఠం కూడా ఉండటం మరో విశేషం. ఇక్కడి అమ్మవారు మహాకాళీ. జ్యోతిర్లింగంతో పాటు అష్ఠాదశ శక్తిపీఠం కలిగి ఉండటం ఇక్కడ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విధంగా కేవలం మూడు క్షేత్రాలు మాత్రమే ఉన్నాయి. అవి కాశీ, శ్రీశైలం, ఉజ్జయినీ మాత్రమే కావడం ప్రత్యేకత.

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది