Sankranti Festival : సంక్రాంతి పండుగ ఎలా, ఎప్పుడు జరుపుకోవాలి… కరెక్టు ముహూర్తం ఎప్పుడు..??
Sankranti Festival : మన భారత దేశంలో సంక్రాంతి పండుగను పర్వదినంలా జరుపుకుంటూ ఉంటారు.. ఈ సంక్రాంతికి ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు. తెలుగు ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో అంగ రంగ వైభవంగా జరుపుకునే పండుగ మకర సంక్రాంతి. అయితే ఈ పండగ ఈ సంవత్సరం ఎప్పుడు జరుపుకోవాలని విషయంపై కాస్త అనుమానాలు నేలకొన్న విషయం అందరికీ తెలిసిందే.. చాలామంది ఈ పండగ ఈ నెలలో 14న అంటున్నారు. ఇంకొందరు 15వ తేదీ అని చెప్తున్నారు. అయితే ఈ నెల 14న రాత్రి 8 గంటల 45 నిమిషాలకు సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు. ఆ టైంలో సూర్యభగవానుడిని పూజించడం వలన అలాగే పుణ్యస్నానాలు, దానాలు చేయడం సాధ్యం కాదు కావున మరుసటి రోజు జనవరి 15 తెల్లవారుజామున ఉదయం 7:15 నుండి 96 మధ్యకాలంలో స్నానాలు దానాలు చేయాలి…
అని వేద పండితులు తెలియజేస్తున్నారు… ఈ మకర సంక్రాంతి అంటే పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ సంక్రాంతిని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండగ ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. తమిళనాడులో పొంగల్, గుజరాత్లో ఉత్తరాయణం, అస్సాంలో బిహు, కేరళలో ఓనం, పంజాబ్లో లోహి అని ఈ పండగని పిలుస్తూ ఉంటారు.. ఈ సంక్రాంతి పూజ ఈ విధంగా చేయాలి.. ఈ మకర సంక్రాంతి రోజున తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాలను ఆచరించాలి. ఆ తదుపరి కొత్త వస్త్రాలను ధరించాలి. అలాగే రాగి కలశంలో ఎర్రని పువ్వులు వేయాలి. దానిలో అక్షత బెల్లం తీసుకోవాలి. ఆ తదుపరి సూర్య భగవానుడికి అర్షను సమర్పించుకోవాలి. సూర్య భగవానుడికి బీచ్ మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రం ఓం గ్రిని సూర్య ఆదిత్య ఓం శ్రీం హీం సూర్యాయ న మః అని పఠించాలి.
సంక్రాంతి పర్వదిన నాడు భగవద్గీతలోని ఓ అధ్యాయాన్ని పఠించాలి.అలాగే ఆహారం, నువ్వులు, నెయ్యి ,దుప్పటి దానం చేయడం వల్ల గొప్ప శుభ ఫలితాలు పొందుతారు. ఈ సంక్రాంతి నాడు నువ్వులతో పాటు పాత్రలను అవసరం ఉన్నవాళ్లకి దానం చేస్తే శని నుండి విముక్తి కలుగుతుందని వేద పండితులు చెప్తున్నారు. ఈ సంక్రాంతి పండుగ నాడు తలస్నానం చేసి దానం చేయడం వలన దానం చేయడం చాలా ప్రధానం. సంక్రాంతి నాడు నువ్వులు బెల్లం తినడం చాలా లాభదాయకం అలాగే నువ్వులు దానం చేయడం అత్యంత ప్రధానమైనది.. మకర సంక్రాంతి రోజున చేసే దానాలు వల్ల ఈ జన్మకే ఆనందం, శ్రేయస్సు అష్ట ఐశ్వర్యాలు కలగడమే కాకుండా ఎన్నో జన్మల పుణ్యఫలం కూడా దక్కుతుంది అని వేద పండితులు తెలియజేస్తున్నారు.. ఈ మకర సంక్రాంతి నాడు అన్నిటికంటే ముఖ్యమైనది దానం చేయడం దానం చేయడం వలన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి..