Lakshmi Kataksham : సిరి సంప‌ద‌లు క‌ల‌గాలంటే ఇదిగో 5 ల‌క్ష్మీక‌టాక్షం ర‌హ‌స్యాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Lakshmi Kataksham : సిరి సంప‌ద‌లు క‌ల‌గాలంటే ఇదిగో 5 ల‌క్ష్మీక‌టాక్షం ర‌హ‌స్యాలు

Lakshmi Kataksham శ్రీలక్ష్మీదేవి.. సకల సంపదలకు అమ్మ అధిదేవత. ఆమె అనుగ్రహం లేనిది ఎటువంటి ధనం అయినా మనకు లభించదు. లక్ష్మీ అంటే కేవలం ధనమే కాదు.. ఆరోగ్యం, సంతానం, ధాన్యం, ఇలా అనేక రకాలుగా అమ్మ రూపాలుగా మనకు గోచరం అవుతుంటుంది. అయితే అమ్మ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉండదో అనే విషయాన్ని తెలుసుకుందాం.. పూర్వం ఒకప్పుడు నారదముని లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది అని శ్రీ మహావిష్ణువుని అడుగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మి […]

 Authored By keshava | The Telugu News | Updated on :23 March 2021,9:31 am

Lakshmi Kataksham శ్రీలక్ష్మీదేవి.. సకల సంపదలకు అమ్మ అధిదేవత. ఆమె అనుగ్రహం లేనిది ఎటువంటి ధనం అయినా మనకు లభించదు. లక్ష్మీ అంటే కేవలం ధనమే కాదు.. ఆరోగ్యం, సంతానం, ధాన్యం, ఇలా అనేక రకాలుగా అమ్మ రూపాలుగా మనకు గోచరం అవుతుంటుంది. అయితే అమ్మ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉండదో అనే విషయాన్ని తెలుసుకుందాం.. పూర్వం ఒకప్పుడు నారదముని లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది అని శ్రీ మహావిష్ణువుని అడుగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు. లక్ష్మీదేవి విశ్వం అంతా వ్యాపించిన విష్ణువునైనా నాతోపాటు అంతటా ఉంటుంది. లక్ష్మి మొదట ఎవరివద్ద వుండదో శ్రీమహావిష్ణువు వివరించాడు.

దీపారాధన చేయని గృహంలో, శుభ్రం లేని ఇండ్లలలో, శంఖద్వని వినిపించని చోటా, తులసిని పూజించని చోట. శంఖరుని అర్చించని చోట, ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట. విష్ణు అర్చన చేయని చోట, పండితులను, విద్యావేత్తలను, బ్రహ్మవేత్తలకు , అతిధులకు భోజన సత్కారాలు జరగని చోట. ధర్మం, శౌచం వీటిని పాటించని చోట కూడా శ్రీలక్ష్మి దేవి నివసించదు.

Lakshmi Kataksham  : లక్ష్మీదేవి ఉండే ప్రదేశాలు

How To Get Lakshmi Kataksham

How To Get Lakshmi Kataksham

శుభ్రమైన ఇల్లు, భక్తులు నివసించే ఇల్లు, నిత్య దీపారాధన, దైవ ఆరాధన ఉండే చోట ఉంటుంది. విష్ణువును ఆరాధించే చోట, శివాభిషేకం లేదా శివార్చన జరిగే చోట అమ్మవారు ఉంటుంది. శ్రీహరి దివ్యచరిత్ర, గుణగానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖద్వని ఉన్నచోట , లక్ష్మి విరాజిల్లుతుంది.
నిత్యం పచ్చని తోరణం, పసుపు గడుపలు, తులసి కోట ఉన్న చోట అమ్మవారు నివసిస్తుంది. ముతైదువలను గౌరవించిన చోట, బాలికలను, మహిళలను అమ్మవారి స్వరూపంగా భావించి గౌరవించిన చోట అమ్మవారు నివసిస్తుంది. ఎల్లప్పుడు సుమంగళీ ద్రవ్యాలతో, అర్చనలతో, సంతోషంతో ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది.

శంకరుడు, విష్ణువులను ఆరాధించిన వారిపై అమ్మ అనుగ్రహం శ్రీఘ్రంగా పడుతుంది. అంతేకాదు నిత్యం వాదనలు, గొడవులు పడే వారి ఇంట్లో, అబద్దాలు ఆడే వారి దగ్గర అమ్మవారు నిలవదు. శుభ్రమైన దుస్తులు, పరిసరాలు, అలవాట్లు ఉన్నచోటే లక్ష్మీదేవి ఉంటుంది.

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది