Dhana Trayodashi : ఈ వస్తువులు ధన త్రయోదశి రోజు తీసుకుంటే లక్ష్మీదేవి ఎప్పుడు మీ గృహంలో నాట్యం చేస్తూ ఉంటుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dhana Trayodashi : ఈ వస్తువులు ధన త్రయోదశి రోజు తీసుకుంటే లక్ష్మీదేవి ఎప్పుడు మీ గృహంలో నాట్యం చేస్తూ ఉంటుంది…!

 Authored By prabhas | The Telugu News | Updated on :17 October 2022,6:30 am

Dhana Trayodashi : హిందూ సాంప్రదాయాలలో ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ దీపావళి. ఈ దీపావళి పండుగ సందడి ప్రారంభమైంది. ఈ పండుగని ఐదు రోజుల వరకు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలలో మొదటి రోజు ధన త్రయోదశి అని పిలుస్తారు. ఈ ఐదు రోజుల దీపావళి పండుగ కోసం కొన్ని అంచనాలు ముందే మొదలవుతాయి. ధన త్రయోదశి రోజు ప్రజలు కొన్ని ఆచారాల విధానంగా కొన్ని వస్తువులను కొంటూ ఉంటారు. ఇప్పుడు ఈ పండుగ ధనత్రయోదశి అక్టోబర్ 23 ఆదివారం రోజు మొదలైంది. ఆనాడు ఎటువంటి వస్తువులను తీసుకోవాలి. ఇప్పుడు మనం తెలుసుకుందాం…

వస్త్రాలు : ఇంటికి ఉత్సాహమైన శక్తిని నింపడానికి ధన త్రయోదశి రోజు కొత్త వస్తువులను కొంటూ ఉంటారు. ఇంటి సభ్యులను ఆనందంగా ఉంచడానికి వారిని ఆకర్షించే వస్త్రాలను కొనుగోలు చేయండి.

దేవుళ్ళ విగ్రహాలు : గదిలో ఉన్న పాత దేవుడి ఫోటోలు, విగ్రహాల స్థానంలో మీరు వెండి, పాలరాయి, ఇత్తడి లేదా చెక్కతో చేసిన విగ్రహాలను తెచ్చుకోవాలి అనుకుంటే ధన త్రయోదశి నాడు కొనుగోలు చేసిన తరువాత మొదట ఆర్తి చేసి తర్వాత వాటిని పూజి స్థలంలో ఉంచవచ్చు…

If these items are taken on Dhana Trayodashi day

If these items are taken on Dhana Trayodashi day

చీపురు… ధన త్రయోదశి రోజు కొనవలసిన వస్తువుల సంఖ్యలో చీపురు కూడా ఉంది. పాత చీపురు ప్లేస్ లో కొత్తది కొనడం వలన మీ డబ్బు సమస్యలను తొలగిపోతాయి.

ఎలక్ట్రానిక్స్ : టీవీ ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనాలి అనుకున్నట్లయితే ధన త్రయోదశి మంచి రోజు. సహజంగా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తెరిచి ఉండే ఎలక్ట్రానిక్ షో రూమ్ లు ధన త్రయోదశి రోజు కూడా తెరిచి ఉంటాయి. ఆనాడు కొత్త వస్తువులను కొనడం వలన కలిగే ప్రయోజనాలలో ఒకటి దీపావళికి ఎన్నో ఆఫర్లను కంపెనీలు ఇస్తూ ఉంటారు. మీరు ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ధన త్రయోదశి రోజు కొనుగోలు చేసుకోవచ్చు..

మెటల్ : ఈ ధన త్రయోదశి రోజు వెండి, విత్తడి, రాగి, బంగారం లేదా మట్టితో చేసిన వంటగది వస్తువులను కొనుగోలు చేయండి. వాటిని దేవుడు ప్రసాదం చేసుకోవడానికి ముందుగా ఉపయోగించండి. అలా చేయడం వలన విజయానికి గుర్తులుగా చూడవచ్చు…

బంగారం : ధన త్రయోదశి సమయంలో బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. బంగారు నాణలు లేదా బంగారు ఆభరణాలు చాలామంది కొనుగోలు చేస్తుంటారు. ధన త్రయోదశి అనేది ఎంతో లాభదాయకమైన పెట్టుబడులు పెట్టడం ద్వారా కుటుంబాలు తమ అదృష్టాన్ని పెంచుకునే రోజు. ఎందుకనగా తార్కికంగా, బంగారం పెట్టుబడులు ఎల్లప్పుడూ నష్టాలని చూడవు. కావున మీరు ధన త్రయోదశి నాడు ఏమి కొనాలి అని ఆలోచిస్తున్నట్లయితే బంగారం కొనడం చాలా శ్రేయస్కరం.

వెండి : బంగారం కొనుక్కోవడానికి అందరి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. కావున అలాంటి సమయాలలో ధన త్రయోదశి నాడు వెండిని కూడా కొనుక్కోవచ్చు. ఆరోజు వెండి వంట సామాగ్రి అలంకార వస్తువులు దేవత విగ్రహాలు ఆభరణాలు కొనుక్కోవడం చాలా మంచిది. ధన మరియు త్రయోదశి అనే పదాలు మూలం ధన త్రయోదశి ధన త్రయోదశి కృష్ణపక్షంలో 13వ నాడు సంపదను సూచిస్తుంది. సాంప్రదాయంగా ఆనాడు హిందూ మాసం అశ్వయుజం లో జరుపుకుంటారు. తన త్రయోదశి రోజు అందరూ సంపద, శ్రేయస్సు, ఆరోగ్యం కోసం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది