Shoes : ఇతరుల చెప్పులు వేసుకుంటే వారి కర్మలు మనకి వస్తాయా… పురాణ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే…!
ప్రధానాంశాలు:
Shoes : ఇతరుల చెప్పులు వేసుకుంటే వారి కర్మలు మనకి వస్తాయా... పురాణ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే...!
Shoes : పూర్వికుల ప్రకారం ఇతరుల చెప్పులు మనం వేసుకోవడం వల్ల వారి దరిద్రం మనకు వస్తుందని చెప్తూ ఉంటారు. అయితే ఇది శుభ్రతకు సంబంధించిన విషయమా..? లేక మరేదైనా ఆధ్యాత్మిక కోణం ఉందా.. ? జ్యోతిష్య శాస్త్రం మరియు హైందవ ధర్మం ప్రకారం ఒకరి చెప్పులు మరొకరు ధరించడం గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలను వివరించాయి. ఈ నేపథ్యంలోనే ఒకరి చెప్పులు మరొకరు ధరించడం వలన కలిగే పరిణామాలు వ్యక్తి అర్థం చేసుకునే విధానాన్ని బట్టి మారుతాయి. ఇక జ్యోతిష్య శాస్త్రంలో శరీరానికి ఆత్మకు లేదా కర్మకు సంబంధించిన ప్రతికూల ప్రభావాలను ఒకరి నుంచి మరొకరికి వెళ్తాయని తెలియజేస్తుంది. అదేవిధంగా ఒకరి బాధలను సంతోషాలని మరొకరు అనుభవిస్తారని సూచిస్తుంది. ఈ విషయాల గురించి వివరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Shoes ఒకరి చెప్పులు మరొకరు వేసుకోవడం వల్ల కలిగే పరిణామాలు..
కర్మ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్మ అంటే వ్యక్తి జీవితంలో కొన్ని ముఖ్యమైన దారులను తెరవడానికి లేదా మూసివేసేందుకు ఒక అంశం. కర్మ అంటే పూర్వజన్మలో చేసిన పాపాలు ప్రస్తుత జీవితంలో ఫలితాలను ఇస్తాయి. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో మరొకరి కర్మలు మనపై ప్రభావం చూపవచ్చు. అదెలా అంటే ఇతరులు చెప్పులు వారి అనుమతి లేకుండా మనం ధరిస్తే వారి కర్మ ఫలితాలు మనకు చుట్టుకుంటాయి. ఇక చెప్పులను దొంగలిచ్చి వాడుకుంటే వారి సంతోషాన్ని శాంతిని హరించుకున్నట్లే అవుతుంది. దీనివల్ల మనకు రావాల్సిన అదృష్టం కూడా తగ్గిపోతుంది. అలాగే ప్రశాంతత లోపిస్తుంది. దీనినే కర్మ చక్రం అని కూడా అంటారు.
గ్రహాల ప్రభావం : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి జీవితం పై శని రాహు కేతువుల ప్రభావం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా శని లేదా రాహు కేతువుల ప్రభావానికి గురైనట్లయితే ఆ ప్రభావం ఇతరులపై కూడా పడవచ్చు. అలాగే ఒకరి అనుభవాలు బాధలు ఇతర వ్యక్తుల జీవితాల పై కనపడతాయి. ఈ నేపథ్యంలోనే ఒకరి చెప్పులను మరొకరు ధరించడం అనేది గ్రహాలపై కూడా ప్రభావం చూపిస్తాయి.
పరిస్థితుల మార్పు : ఇతరుల కర్మలు అంటే వారు చూసిన కష్టాలు బాధలు మన మీద పడే ప్రభావం కూడా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి చెప్పులు మనం ధరించినట్లయితే ఆ వ్యక్తి కష్టం లేదా బాధను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. సాంప్రదాయం ప్రకారం చూసుకున్నట్లయితే ఒకరి చెప్పులను మరొకరు ధరించడం వలన వారి కర్మలలోని ప్రతికూల ఫలితాలను మరియు పరిణామాల ప్రభావం చూపిస్తుంది. చెప్పులు దొంగిలించడం వలన ఆ వ్యక్తి యొక్క బాధలు ఇబ్బందులు మరియు కష్టాలు చెప్పులు దొంగలిచ్చిన వ్యక్తికి వెళ్లిపోతాయి.