Shoes : ఈ విష‌యం మీకు తెలుసా.. చెప్పులు లేదా షూస్ పోతే పోలీసుల‌కి ఫిర్యాదు చేయాలా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shoes : ఈ విష‌యం మీకు తెలుసా.. చెప్పులు లేదా షూస్ పోతే పోలీసుల‌కి ఫిర్యాదు చేయాలా?

 Authored By ramu | The Telugu News | Updated on :6 August 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Shoes : ఈ విష‌యం మీకు తెలుసా.. చెప్పులు లేదా షూస్ పోతే పోలీసుల‌కి ఫిర్యాదు చేయాలా?

Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి తక్కువ విలువగల వస్తువుల గురించి అసలు పట్టించుకోకపోవడమే సహజం. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ఈ ఆలోచనలను పూర్తిగా తలకిందులు చేసింది. చట్టపరంగా అది ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో తెలియజేస్తూ, ప్రజలందరినీ షాక్‌కు గురిచేసింది.

Shoes ఈ విష‌యం మీకు తెలుసా చెప్పులు లేదా షూస్ పోతే పోలీసుల‌కి ఫిర్యాదు చేయాలా

Shoes : ఈ విష‌యం మీకు తెలుసా.. చెప్పులు లేదా షూస్ పోతే పోలీసుల‌కి ఫిర్యాదు చేయాలా?

Shoes : ఆలోచించ‌ద‌గ్గ‌దే..

ఇన్‌స్టాగ్రామ్‌లో న్యాయవాది అమితేష్ పాండే షేర్ చేసిన ఈ వీడియో మొదట సరదాగా అనిపించినా, దీని వెనుక ఉన్న సీరియస్ మెసేజ్ ఎంతో తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన చెప్పిన విధంగా, మీరు రూ.150 విలువ గల చెప్పులను కోల్పోయినా సరే, దాన్ని పోలీసులకు తెలియజేసి, FIR నమోదు చేయించుకోవడం చాలా అవసరం. మీరు ఓ ప్రదేశంలో చెప్పులు కోల్పోయారనుకోండి. అదే ప్రదేశంలో మృతదేహం దొరికితే, పోలీసులు అక్కడ ఉన్న చెప్పులను ఆధారంగా తీసుకుని హత్య కేసులో మిమ్మల్ని అనుమానితుడిగా పరిగణించవచ్చు.

ఇది సీరియస్ కేసు అయిన IPC సెక్షన్ 302 (హత్య) కింద విచారణకు దారి తీసే ప్రమాదం ఉంది. అలా మీరు నిర్దోషి అయినా కూడా, కోర్టుల చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ఈ వీడియోకు ఇప్పటికే 2.3 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. కొందరు నెటిజన్లు దీన్ని సరదాగా తీసుకున్నా, కొంతమంది మాత్రం దీని లోతును అర్థం చేసుకున్నారు. “చెప్పులపై నా పేరు లేదుగా, ఎలా గుర్తిస్తారు?” అంటూ కొందరు ప్రశ్నిస్తే, మరికొందరు “ఇవి నాకే చెందినవి అని ఎలా నిరూపించాలి?” అంటూ కామెంట్లు చేశారు. అయినా కూడా, వీడియోలో న్యాయవాది ఇచ్చిన సలహా చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు అన్నది చాలా మందిని ఆలోచింపజేసింది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది