ఆ రోజుల్లో తల స్నానం చేస్తే.. దరిద్రమంతా మీ నెత్తి పైనే..!
హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వారాల్లో తల స్నానం చేయకూడదని చెబుతుంటారు. అంతే కాదు మరి కొన్ని రోజుల్లో కచ్చితంగా తల స్నానం చేయాలని కూడా అంటుంటారు. అయితే ఏ రోజుల్లో తల స్నానం చేయాలి, ఏ రోజుల్లో చేయకూడదు అనేది మాత్రం చాలా మందికి తెలియదు. ఇలా తెలియకుండా చేయకూడని కొన్ని రోజుల్లో తలస్నానం చేసి లేని పోని కష్టాలను, దరిద్రాన్ని కావాలని తలకు తగిలించుకుంటున్నారు. అయితే మీకు అలా జరగకుండా సుఖ, సంతోషాలతో ఉండాలంటే ఇవి పాటించాల్సిందే. అయితే స్త్రీలు, పురుషులు ఏయే రోజుల్లో తన స్నానం చేయాలి, ఏయే రోజుల్లో తల స్నానం చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మహిళలు సోమవారం తల స్నానం చేస్తే… నిత్య సౌభాగ్యంతో వర్ధిల్లుతారంట. అంతే కాకుండా వీలయినంత వరకూ ప్రతీ సోమ వారం ఆడవాళ్లు తలంటు స్నానం చేయాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒంటికి నూనె.. ముఖానికి పసుపు రాసుకొని, నలుగు పెట్టకొని స్నానం చేస్తే మరింత మంచిదట. అలాగే బుధవారం తల స్నానం చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుందట. ఎలాంటి కలహాలు లేకుండా సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తారంట. అంతే కాకుండా శనివారం రోజు తల స్నానం చేస్తే ఐశ్వర్యం కల్గుతుందట. శుక్ర, మంగళ వారాల్లో అస్సలే తల స్నానం చేయకూడదట. కచ్చితంగా చేయాల్సి వస్తే… అంటే మైన పడినప్పుడు మాత్రమమే ఆ రోజుల్లో తల స్నానం చేయాలని పెద్దలు చెబుతున్నారు.
అయితే ఇప్పుడు పురుషులు ఏ ఏ రోజుల్లో తల స్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు కల్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. సోమ వారం పురుషులు తలంటు స్నానం చేస్తే.. వారి అందం మరింత పెరుగుతుందట. మంగళ వారం నాడు తలంటు స్నానం చేస్తే… విపరీత దుఃఖానికి కారణం అవుతుందట. బుధ వారం పురుషులు తల స్నానం చేస్తే.. లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుందట. గురు వారం తలంటు పోసుకుంటే ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయట. అలాగే శుక్ర వారం తల స్నానం చేస్తే… అనుకోని ఆపదలు కల్గుతాయని చెబుతుంటారు. మగ వాళ్లు శనివారం రోజు తల స్నానం చేస్తే మహా భోగం కల్గుతుంది. ఆదివారం తలంటు స్నానం చేస్తే తాపంతోపాటు ఆ కోరికలు పెరుగుతాయి.