Chanakya Niti : ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాడు. నేటితరం కూడా ఇప్పటికీ చాణక్య నీతిలోని విషయాలను ఆచరిస్తున్నారు. చాణక్య తన జీవితంలో ఎదురైన ఎన్నో సంఘటనలను, అనుభవాలను చాణక్య నీతిలో తెలియజేశారు. జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే ఏం చేయాలనే దానిపై చక్కగా వివరించాడు. ఎలాంటి నియమాలను పాటిస్తే అనుకున్నవి సాధిస్తామో చెప్పాడు. ఎవరితో స్నేహం చేయాలి.. ఎలాంటి వారికి దూరంగా ఉండాలి అనే విషయాలు వివరించాడు. ఎలాంటి భాగస్వామిని ఎంచుకోవాలి.. పిల్లల్ని ఎలా పెంచాలి అనే విషయంలో పలు నియమాలు సూచించాడు.
చాణక్య నీతి ప్రకారం లైఫ్ లో సంతోషంగా ఉండాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం… జుట్టు కత్తిరించుకున్నాక తప్పనిసరిగా స్నానం చేయాలని పెద్దవాళ్లు సూచిస్తుంటారు. ఇదే విషయం చాణక్య తన నీతి శాస్త్రంలో తెలిపాడు. సెలూన్ షాప్ కి వెళ్లి వచ్చిన తర్వాత శరీరంపై చిన్న చిన్న వెంట్రుకలు పడి ఉంటాయి. ఇలాగే ఉంటే తినే సమయంలో శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని చెప్పాడు. అందుకే తప్పనిసరిగా తల స్నానం చేయాలని సూచించాడు. అలాగే విపరీతమైన కోపం ఉండటం మంచిది కాదని చాణక్య తెలిపాడు. కోపం వల్ల ఆవేశపూరితంగా తప్పులు చేసి తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఇది ఇతరులకు కూడా ఇబ్బందిగా ఉంటుంది.
అందుకే కోపం తగ్గించుకుని దానివల్ల వచ్చే అనర్థాలు లేకుండా చూసుకోవచ్చు. అలాగే చాణక్య నీతి ప్రకారం అత్యాశ ఉన్నవారు ఎప్పటికీ ఎందులోనూ తృప్తి పొందలేడు. అత్యాశతో తప్పుడు మార్గాల్లో ముందుకు వెళ్తారు. దీంతో భవిష్యత్తు నాశానం చేసుకుంటారు. అందుకే అత్యాశతో ఉండకూడదని సూచించాడు. అలాగే ఏదైనా సాధించాలనుకుంటే ముందుగా లక్ష్యాన్ని పెట్టుకుని దానికి తగ్గట్టుగా కష్టపడి పనిచేయాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరుకుంటారు. అయితే కొంతమంది ఎప్పుడూ అబద్దాలు ఆడుతుంటారు. దీని వల్ల కొన్ని సార్లు నిజం చెప్పినా ఎవరూ విశ్వసించరు. అంతేకాకుండా గౌరవం కోల్పోతారు.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.