ఈమాసంలో ఈ దానాలు చేస్తే సర్వశుభాలు మీ సొంతం !
Danalu : మాసం అంటే నెలుల.. తెలుగు నెలలో రెండోనెల వైశాఖమాసం. ఈ మాసాన్ని మాధవమాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసం శ్రీమహావిష్ణేవుకు అత్యంత ప్రీతికరమైనదిగా పురాణాలలో పేర్కొన్నారు. అయితే ఈ మాసంలో మానవుడు చేసే సేవలను మాధవసేవగా భావించి చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ మాసంలో కిందిపేర్కొన్న దానాలను చేస్తే కలిగే ఫలితాలను తెలుసుకుందాం…
దోస, బెల్లం, చెరుకు -సర్వపాపాలు నశిస్తాయి. మంచం -సుఖసంతోషాలు అభివృద్ధి చెందుతాయి.
వస్త్రాలు-ఆయుష్షు వృద్ధి, ముఖ్యంగా తెల్లవస్త్రాన్ని దానం చేస్తే పూర్ణాయుష్షు పొంది అంత్యంలో ముక్తిని పొందుతారు. మామిడిపళ్ళు – పితృదేవతలు సంతోషిస్తారు, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. పానకం కుండ – పితృదేవతలకు వంద సార్లు గయలో శ్రాద్ధం పెట్టిన పుణ్యఫలం దక్కుతుంది. కుంకుమ- స్త్రీలకు పూర్ణ ఆయుష్షు కలిగిన భర్త లభిస్తాడు, ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. గంధం – తరచుగా ప్రమాదాలకు గురికాకుండా ఉండటానికి బియ్యం -అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, యజ్ఞాలు చేస్తే వచ్చే పుణ్యం ప్రాప్తిస్తుంది. ఆవునెయ్యి-అశ్వమేథయాగం చేసిన పుణ్యం లభిస్తుంది, విష్ణు సాయుజ్యం పొందుతారు. పితృదేవతలకు వదిలినవారికి దారిద్ర్య బాధ ఉండదు.
అన్నదానం-విశేష ఫలితం పొందుతారు, సమస్త దేవతల ఆశీస్సులు పొందుతారు, సర్వధర్మాలను ఆచరించిన ఫలితం పొందుతారు. పెరుగు అన్నం -చేసిన కర్మలు తొలగి పుణ్యం లభిస్తుంది. తాంబూలం-అధిపతులు అవుతారు. కొబ్బరికాయ-ఏడు తరాల పితృదేవతలను నరకభాదల నుండి విముక్తులను చేస్తారు మజ్జిగ-సరస్వతీదేవి అనుగ్రహంతో విద్యాప్రాప్తి కలుగుతుంది.చెప్పులు -నరకబాధల నుండి విముక్తి లభిస్తుంది. గొడుగు-సమస్త దోషాలు నివారింపబడతాయి, కష్టాల నుండి విముక్తి పొందుతారు, మృత్యుబాధ ఉండదు. పైన పేర్కొన్న దానాలను పరిశీలిస్తే మన పూర్వీకుల మానవతా హృదయం కన్పిస్తుంది.
ఎండలు బాగా పెరిగిన ఈ నెలలో పేదలకు, అవసరార్థులకు ఆయా దానాలు చేయడం అనేది మాధవసేవగా పేర్కొన్నారు. అంటే ప్రతీ జీవిలో మాధవుడిని చూసుకోవాలన్న భావన పెంచేలా ఆయా దానాలను పేర్కొన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు దానం చేస్తున్నాం అనే అహంకారంతో కాకుండా దానం చేసే అవకాశం ఇచ్చారు అని దానం తీసుకున్న గ్రహీతలను సాక్షాత్తు విష్ణు స్వరూపులుగా భావించి దానం చేయాలి. అప్పుడు వైశాఖం కాస్తా మాధవమాసంగా మారుతుంది. మానవసేవే మాధవసేవ. కరొనా మహ్మరి కాలంలో ప్రతి ఒక్కరు తమకు చాతనైనంత సేవను అవసరం ఉన్నవారికి చేసి ఆదుకోవాలి. అప్పుడు శ్రీవిష్ణువు అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది.
రాము తెలుగున్యూస్