Phalguna Masam : పాల్గుణమాసం ప్రత్యేకతలు ఇవే

Authored By Devotional Desk | The Telugu News | Published on: March 14, 2021, 6:00 am

Phalguna Masam : తెలుగు మాసాలలో చివరిది పాల్గుణమాసం. ఈ మాసంతో ప్రస్తుతం నడుస్తున్న శ్రీశార్వరీ నామ సంవత్సరం పూర్తవుతుంది. పాల్గుణ అమావాస్య తర్వాతి రోజు చైత్రపాడ్యమి అదేనండి ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అయితే ఏడాదిలో వచ్చే ప్రతి మాసానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్లే ఈ మాసానికి కూడా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పాల్గుణమాసం గురించి తెలుసుకుందాం…

ఆకాశంలో శ్వేత వర్ణంతో దండకారంగా ప్రకాశిస్తున్న రెండు నక్షత్రాలతో కూడిన మండలమే ఫల్గుణి నక్షత్రం. చాంద్రమానంలోని పన్నెండు మాసాలలో పాల్గుణమాసం చివరిది. ఈ నెలలోని పౌర్ణమినాడు చంద్రుడు పూర్వఫల్గుణి లేదా ఉత్తరఫల్గుణి నక్షత్రానికి దగ్గరగా ఉండటం చేత ఇది పాల్గుణమాసం అయింది. ఆరు ఋతువులలో ఆఖరిదైనా శిశిర ఋతువు ఈ మాసంతో ముగుస్తుంది. సూర్యుడు ఫాల్గుణ మాసంలో మీనా రాశిలో ప్రవేశిస్తాడు. పాల్గుణమాసం విష్ణువుకు ప్రీతికరం అని భాగవతం పేర్కొంది. ఈ నెలలో విష్ణువుని పూజించడం విశేష ఫలాలను పొందవచ్చు. ఈ మాసంలో చేసే దానాల వల్ల గోవిందుని అనుగ్రహం లభించి అరిష్టాలు హరింపబడుతాయని పెద్దలు చెప్తారు. ఈ మాసంలో గోదానం చెప్పలేనంత ఫలితాన్నిస్తుంది.

These are the specialties of the participatory month

These are the specialties of the participatory month

పాల్గుణ మాసంలో జరిగిన పురాణ విశేషాలు : Phalguna Masam

పాల్గుణ పాడ్యమి రోజునే రామాయణంలో అతిముఖ్యమైన రామ, రావణ యుద్ధంలో ముఖ్య ఘట్టం. రావణ సంహారం జరిగింది పాల్గుణ అమావాస్య రోజే.అదేవిధంగా మహాభారతంలో ధర్మరాజు, భీమసేనుల జననం ఈ మాసంలోనే జరిగింది. కౌరవాగ్రజుడు దుర్యోధనుడు అతని సహోదరుడైన దుశ్యాసనుడు ఈ మాసంలోనే జన్మించారు.

 

Devotional Desk

No bio available for this author.

  1. "Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి హనోయ్ వెకేషన్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటోలు!"

  2. "Avinash Reddy : వేల కొద్దీ డాక్యుమెంట్లతో ఈడీ ముందుకొచ్చిన అవినాష్ రెడ్డి.. తాడేపల్లిలో మొదలైన టెన్షన్..!"

  3. "Ranabaali Movie First Review : రణబాలి మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ..!"

  4. "Vijayasai Reddy : వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంపై రచ్చ.. వైసీపీ, టీడీపీ మౌనంపై విజయసాయిరెడ్డి సంచలన ఫైర్..!"

  5. "Rahul Gandhi : తెలంగాణ కాంగ్రెస్ ‘ఓటు చోరీ’ సభలో రాహుల్ గాంధీ బిగ్ మిస్టేక్.. పార్టీకి సెల్ఫ్ గోల్ తప్పదా..?"

  6. "Ysrcp : కాకినాడ మేయర్ రేసులో ముద్రగడ క్రాంతి.. కూటమికి చెక్ పెట్టేందుకు వైసీపీ బిగ్ స్కెచ్ ..?"

  7. "Khairatabad By Election : ఖైరతాబాద్ ఉప ఎన్నిక సర్వే.. ఏ పార్టీ లీడ్ లో ఉందంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp