Zodiac Signs : 2025లో ఈ రాశుల వారి పై ఏలినాటి ప్రభావం… పెను మార్పులు సంభవిస్తాయి…!
ప్రధానాంశాలు:
Zodiac Signs : 2025లో ఈ రాశుల వారి పై ఏలినాటి ప్రభావం... పెను మార్పులు సంభవిస్తాయి...!
Zodiac Signs : నవగ్రహాలలో శని దేవుడిని కీలకమైన గ్రహంగా భావిస్తారు. ఇక ప్రస్తుతం శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది మార్చిలో మీనరాశి లోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఇక శని న్యాయదేవత మరియు చేసిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తాడు. మంచి చేసిన వారికి మంచిని మరియు చెడు చేసిన వారికి చెడుని ప్రసాదిస్తాడు. అలాగే శని ఒక రాశి నుంచి మరొక మరొక రాశిలోకి ప్రవేశించడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పడుతుంది. మరి ఏ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
మేషరాశి : మేష రాశి వారికి 2025వ సంవత్సరంలో ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. దీని కారణంగా ఏ పని చేసిన అందులో ఆటంకాలు ఎదురవుతాయి. ఇలా వీరికి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. కావున మేష రాశి జాతకులు శనివారం నాడు శని దేవుడికి నల్ల నువ్వులతో పాటుగా నువ్వుల నూనెతో అభిషేకం చేసిన నల్లటి వస్త్రం కప్పడం వలన శని దేవుడు కొంతవరకు శాంతిస్తాడు. అదేవిధంగా గురువుని దర్శించడం మంచిది. ఎందుకంటే జీవితంలో ఎదురయ్యే బాధలు సమస్యల తీవ్రతను చాలా వరకు తగ్గిస్తాడు. అందుకోసమే జ్యోతిష్యంలో కచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం ఉండాలని చెబుతారు.
Zodiac Signs కుంభరాశి
2025 సంవత్సరంలో కుంభ రాశి జాతకులకు ఏది నాటి శని మూడు దశలుగా ఉంటాయి. ముఖ్యంగా మొదటి రెండు దశలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇక మూడవ దశలో కొంచెం ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా ఈ మూడో దశలో కొన్ని మంచి ఫలితాలను కూడా అందుకుంటారు. అలాగే సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. అయితే కుంభరాశి జాతకాలకు కష్టాలు విపరీతంగా ఉన్నప్పుడు భగవంతుడు మీద విరక్తి పుడుతుంది. కాబట్టి పట్టుదలగా ప్రతిరోజు దేవాలయానికి వెళ్లి భగవంతుడిని దర్శించుకుంటే సమస్యల నుంచి బయట పడవచ్చు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మీనరాశి : మీనరాశి జాతకులకు 2025వ సంవత్సరంలో ఏది నాటి శని రెండోదశ వీరిని ఎక్కువగా బాధపెడుతుంది. ఈ సమయంలో అనేక మానసిక సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా శారీరక ఆర్థిక సమస్యలు ఎదుర్కోవడంతో కాస్త ఇబ్బందికి గురవుతారు. ముఖ్యంగా మానసిక సమస్యలను ఎదుర్కొనేటప్పుడు చాలా బాధపడతారు. ఇక శారీరక ఆరోగ్యం బాగుంటుంది. కొన్ని సందర్భాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది.