Raksha Bandhan : సోదరి రాఖీ ప్లేట్ ను తప్పనిసరిగా.. ఈ వస్తువులతో అలంకరించాలి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Raksha Bandhan : సోదరి రాఖీ ప్లేట్ ను తప్పనిసరిగా.. ఈ వస్తువులతో అలంకరించాలి..

 Authored By aruna | The Telugu News | Updated on :11 August 2022,6:30 am

Raksha Bandhan : రాఖీ పండుగ కోసం అక్క తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్లు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పండగ జరుపుకోవడానికి కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. సోదరుల ప్రేమకి గుర్తుగా ఈ రాఖీ పండుగ పరిగణించబడుతుంది. రాఖీ పండుగ రోజున సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీలు కడతారు. ఈ సందర్భంగా రాఖీ పండుగ కోసం రెడీ చేసే ప్లేటుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాఖీ ప్లేటును తయారు చేసేటప్పుడు ప్లేట్లో తప్పనిసరిగా ఈ వస్తువులు ఉంచాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాఖీ ప్లేటులో తప్పనిసరిగా కుంకుమ ఉండాలి. కుంకుమ లక్ష్మీదేవికి గుర్తుగా పరిగణించబడుతుంది. కుంకుమ పెట్టడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉంటాయని నమ్మకం. డబ్బుకు, తిండికి ఎప్పుడు లోటుండదు. అలాగే రాఖి ప్లేట్లో చందనాన్ని కూడా అమర్చాలి. దీని ద్వారా సోదరి విష్ణువు, గణేశుని ఆశీర్వాదం పొందుతుంది. అంతేకాదు సోదరులకు ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తుంది. అలాగే పూజ ప్లేట్లో రాఖీ లేకుండా అసంపూర్ణం. రాఖీ ప్లేట్లో రాఖీని పెట్టుకోవాలి. సోదరుల మణికట్టు మీద కట్టే ముందు రాఖిని దేవుడు పాదాలు వద్ద ఉంచాలి. తర్వాత రాఖీని సోదరుడికి కట్టాలి. రాఖీ అనేది సోదరి సోదరుల మధ్య ప్రేమ, విడదీయరాని బంధానికి గుర్తు.

In raksha bandhan add these things in rakhi plate

In raksha bandhan add these things in rakhi plate

అలాగే రాఖీ ప్లేట్లో దీపం తప్పనిసరిగా పెట్టాలి. దీపం వెదజల్లే వెలుగు జీవితంలో సానుకూలతను తెస్తుంది. శుభ, సంతోషకరమైన జీవితానికి ప్రారంభాన్ని సూచిస్తుంది. సోదరుడికి రాఖీ కట్టే ముందు అతనికి హారతి ఇవ్వాలి. ఇది సోదరుడి ప్రతికూల ప్రభావాన్ని తొలగిస్తుంది. అలాగే హిందూ సాంప్రదాయంలో అక్షతలకు ప్రత్యేక స్థానం ఉంది. బియ్యపు గింజలను పసుపు కలిపి తయారు చేసే వాటిని అక్షతలు అంటారు. వీటిని సోదరుని ఆశీర్వదిస్తూ వేస్తారు. వీటి వలన దుర్గామాత, గణేశుడు శ్రీరాముని, శివుని ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది