Indian Wedding : వివాహంలో వధూవరుల చేతిలో… కొబ్బరి బోండాన్ని ఎందుకు పెడతారో తెలుసా…?
ప్రధానాంశాలు:
Indian wedding : వివాహంలో వధూవరుల చేతిలో... కొబ్బరి బోండాన్ని ఎందుకు పెడతారో తెలుసా...?
Indian wedding : ఎన్ని వివాహాలు జరిగినా కూడా అన్నిట్లో కూడా వధూవరుల చేతుల్లో కొబ్బరిబోండం ఉండాల్సిందే. అసలు ఇలాంటి సాంప్రదాయం వెనుక దాగిన కారణమేమిటి. కేవలం ఆచారం మాత్రమే కాదు కొన్ని లోతైన అంతరార్థాలు, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అప్పట్లో కొందరు ఈ కొబ్బరి బొండం నువ్వు వివిధ రకాల అలంకరణలు చేసి ముస్తాబులు చేస్తూ ఉన్నారు.ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్. ఇలాంటి సాంప్రదాయం ఎందుకు,పెళ్లి తర్వాత ఈ కొబ్బరి బొండంను ఏం చేస్తారు అనే విషయాలు ఎప్పుడైనా ఆలోచించారా… దీనిలో ఉన్న అంతరార్ధాలు ఏమిటో తెలుసుకుందాం…
కొబ్బరికాయ హిందూ సంస్కృతిలో అత్యంత పవిత్రమైనది. ఇది శుద్ధికి చిహ్నంగా భావిస్తారు. కొబ్బరికాయ లోపల ఉండే నీరు, స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది.ఇది కొత్త వివాహ బంధాలలోకి అడుగుపెడుతున్న,వధూవరుల మనుషులు స్వచ్ఛంగా స్వార్థం లేకుండా ఉండాలని సూచిస్తుంది. వారి కొత్త జీవితం పవిత్రంగా స్వచ్ఛంగా సాగాలని ఆశీర్వదించినట్లు.

Indian Wedding : వివాహంలో వధూవరుల చేతిలో… కొబ్బరి బోండాన్ని ఎందుకు పెడతారో తెలుసా…?
Indian wedding : : దేవతలకు ప్రతీక
కొబ్బరికాయను త్రిమూర్తులకు అంటే, బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులకు ప్రతీకగా భావించే ఆచారం కూడా ఉంది. కొబ్బరికాయపై ఉండే మూడు కళ్ళను ఈ త్రిమూర్తుల రూపంగా చూస్తారు. ఇది దైవ సాక్షిగా వివాహం జరుగుతుందని కొత్త దంపతులపై దేవతల ఆశీస్సులు ఉంటాయని సూచిస్తుంది.
సంపూర్ణత్వం,ఫలవంతం : కొబ్బరికాయ సంపూర్ణతకు ఫలవంతానికి ప్రతీక, ఇది బయట గట్టిగా,లోపల స్వచ్ఛమైన నీటితో చివరకు కొబ్బరి ముక్కతో ఉంటుంది. ఇది భార్యాభర్తల జీవితంలో అన్ని దశలను సంతోషాలు, కష్టాలు కలిసి ఎదుర్కొని వారి బంధం సంపూర్ణంగా బలమైనదిగా ఉండాలని సూచిస్తుంది.అలాగే వారికి మంచి సంతానం కలగాలని వారి వంశవ వృద్ధి చెందాలని కూడా ఇది ఆశీర్వదిస్తుంది.
నిస్వార్థ సేవ : కొబ్బరికాయ తనలోని నీటిని, కొబ్బరినీ పూర్తిగా త్యాగం చేస్తుంది. ఇది కొత్తగా ఏర్పడిన కుటుంబంలో నిస్వార్ధ సేవ త్యాగం సహకారం, ఉండాలని తెలియజేస్తుంది. భార్యాభర్తలు ఒకరినొకరు నిస్వార్ధంగా,సేవ చేసుకుంటూ త్యాగబుద్ధితో ఉండాలని కోరుకుంటారు.
సమృద్ధి,ఐశ్వర్యం : కొబ్బరికాయను సంపద, సమృద్ధికి చిహ్నంగా కూడా భావిస్తారు. వధూవరుల చేతుల్లో కొబ్బరిబోండం పెట్టడం వల్ల వారి జీవితంలో ఎల్లప్పుడూ సమృద్ధి ఐశ్వర్యం ఉండాలని కోరుకున్నట్లు.
స్థిరత్వం, బలం : కొబ్బరి చెట్టు చాలా దృఢంగా స్థిరంగా ఉంటుంది.ఇది జీవితంలో ఎదురయ్యే సవాలను ధైర్యంగా ఎదుర్కొని వారి బంధాన్ని దృఢంగా నిలబెట్టుకోవడానికి గుర్తుచేస్తుంది. దీని వెనుక ప్రధాన ఉద్దేశం. వారి కొత్త జీవితం పవిత్రంగా సమృద్ధిగా నిస్వార్థ సేవతో నిండి ఆశీర్వదించబడాలి అని కోరుకోవడం.
వివాహం తర్వాత ఏం చేస్తారు: కొన్ని ప్రాంతాలలో వివాహ వేడుకలు పూర్తయిన తర్వాత, వధూవరులు ఇద్దరు కలిసి.ఆ కొబ్బరి బోండాలను దగ్గర్లోని ప్రవహించే నీటిలో అంటే,నదీ, కాలువ లో వదలాలి. ఇది తమ శుభకార్యాన్ని ఆటంకాలు లేకోకుండా, పూర్తయినందుకు దైవానికి కృతజ్ఞతలు తెలుపుతూ దంపతులకు శుభం కలగాలని కోరుతూ చేస్తారు. వారి దాంపత్య జీవితం సాఫీగా నీరాటకంగా సాగాలని కోరుకోవడానికి, ప్రతీ మరికొన్ని కుటుంబాల్లో వీటిని ఇంట్లోనే భద్రపరుస్తారు.
అతి అలంకరణ మంచిదేనా : చని తాజా కొబ్బరి బొండంపై పసుపు కుంకుమ బొట్లు పెట్టి చుట్టూ చిన్న పూలదండ చుట్టం అనేది సాధారణంగా అనుసరించే పద్ధతే. పెళ్లి వేడుకల్లో ప్రతిదీ అందంగా కనిపించాలని కోరుకునే వారు,కొబ్బరి బోండాన్ని కూడా పూలు రిబ్బన్లు, చిన్న అద్దాలు,లేదా గ్లీట్టర్లతో అలంకరిస్తుంటారు. కొంతమంది సాంప్రదాయవాదులు మాత్రం కొబ్బరి బొండం సహజత్వాన్ని మార్చకూడదని, దానిని అలంకరించకుండానే శుభప్రదంగా భావిస్తారు. కొబ్బరికాయ దైవత్వానికి ప్రతీక కాబట్టి దీనిని కృత్తిమ అలంకరణతో కప్పడం సరికాదని నమ్ముతారు.