Japa Mala : జపమాలతో కలిగే ఈ అద్భుత ప్రయోజనాలివే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Japa Mala : జపమాలతో కలిగే ఈ అద్భుత ప్రయోజనాలివే..

 Authored By mallesh | The Telugu News | Updated on :24 January 2022,10:00 pm

Japa Mala : భగవంతుడిని ఆరాధించడం అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఎవరికి నచ్చిన పద్ధతిలో వారు దేవ దేవుడిని ఆరాధిస్తుంటారు. మతాలు వేరు అయినప్పటికీ పూజించే దేవుడు ఒక్కటేనన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, హిందూ మతంలో ధర్మం ప్రకారం.. భక్తులు రకరకాల పద్ధతుల్లో దేవుడిని పూజిస్తుంటారు. అలా పూజించే పద్ధతులలో జపం కూడా ఒకటి. ఇది అన్నిటికంటే కూడా శ్రేష్టమైనదని పెద్దలు వివరిస్తుంటారు. కాగా, ఏ జపం ఏ మాలతో చేయాలి? అందువల్ల కలిగే ప్రయోజనాలేంటనే సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం.

దేవుడిని పూజించే క్రమంలో జపం చేస్తుండటం మనం చూడొచ్చు. అలా జపం చేస్తున్న క్రమంలో ధ్యానముద్ర దాల్చి ఏకాగ్రత పెంచుకోవచ్చును కూడా. అలా దండలు ద్వారా జపాలు చేస్తుంటారు. హిందూ ధర్మం ప్రకారం భక్తులు ఉపయోగించే జపాల మాలలు లేదా దండలు రకరకాలుగా ఉంటాయి. అందులో ఒక్కోదానికి ఒక్కో ఉపయోగం ఉంటుంది. జ్యోతిష్యంలో పేర్కొన్నట్లుగానే ఈ విలువైన రత్నాలు లేదా దండల ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇలా రత్నాల ద్వారా పూజలు చేస్తే కనుక అత్యద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.మీ జాతక చక్రంలో సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే మీరు బిల్వమాలతో జపం చేస్తే చక్కటి ప్రయోజనాలుంటాయి.

japa mala importance of garland

japa mala importance of garland

Japa Mala : ఏ మాలతో ఎటువంటి ఫలితం ఉంటుందంటే..

బిల్వ చెక్కతో తయారు చేసిన మాల మాణిక్యంతో జపం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే తులసి మాలతో శ్రీహరి మంత్రాన్ని జపిస్తూ జపం చేస్తే చాలా మంచిది. మీ జీవితం శుభప్రదం అవుతుంది కూడా. చిన్ని కృష్ణుడి అనుగ్రహం పొందాలంటే కనుక మీరు వైజయంతి మాలతో జపం చేయాల్సి ఉంటుంది. అలా వైజయంతి హారంతో జపం చేస్తే కనుక మీ శని దోషం తొలగిపోవడంతో పాటు శని దేవుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించడానికి‌గాను తామరమాల జనం చేయాల్సి ఉంటుంది. ఈ మాల ద్వారా జపం చేస్తే మీ వ్యాపారంలో పురోగతి పొందుతారు. భోళా శంకరుడి కన్నీటి నుంచి ఉద్భవించినట్లు భావించే రుద్రాక్ష మాలతో జపం చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుంది.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది