Sabarimala : శబరిమలలో భక్తుల ప్రవేశం పై కేరళ నిర్ణయం ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sabarimala : శబరిమలలో భక్తుల ప్రవేశం పై కేరళ నిర్ణయం !

Sabarimala : ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శబరిమలలో కుంభ మాసం అంటే మాఘమాసం కోసం భక్తుల ప్రవేశంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాఘమాసాన్ని ఇక్కడ కుంభ మాసం అంటారు. ఈ కుంభనెల సందర్భంగా ఎక్కువ మందిని అనుమతించాలని ట్రావెన్ కోర్ దేవస్థానం చేసిన విజ్ఞప్తి ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఐదువేల మంది భక్తులను అనుమతించామని, అంతకంటే ఎక్కువ మందిని అనుమతించడం […]

 Authored By uday | The Telugu News | Updated on :12 February 2021,10:30 pm

Sabarimala : ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శబరిమలలో కుంభ మాసం అంటే మాఘమాసం కోసం భక్తుల ప్రవేశంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాఘమాసాన్ని ఇక్కడ కుంభ మాసం అంటారు. ఈ కుంభనెల సందర్భంగా ఎక్కువ మందిని అనుమతించాలని ట్రావెన్ కోర్ దేవస్థానం చేసిన విజ్ఞప్తి ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఇప్పటికే ఐదువేల మంది భక్తులను అనుమతించామని, అంతకంటే ఎక్కువ మందిని అనుమతించడం కుదరదని తేల్చిచెప్పింది. కుంభనెల నేపథ్యంలో ఈ నెల 12న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోనుంది. ఈ సందర్భంగా 15వేల మంది భక్తులకు అవకాశం కల్పించాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కోరింది. కేరళ ప్రభుత్వాన్ని బోర్డు ఇటీవల ఓ లేఖలో రాసింది. కేరళ రాష్ట్రంలో నెలకొన్న కోవిడ్ తీవ్రతను అంచనా వేసి.. నిర్ణయాన్ని వెల్లడించాల్సిందిగా వైద్య ఆరోగ్యశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఆరోగ్యశాఖ హెచ్చరికల నేపథ్యంలో కేరళప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది