Lakshmi Devi : గుమ్మం పైన ఈ ఫోటోలు ఉండే ఇళ్లకు లక్ష్మీదేవి ఎప్పటికీ రాదు…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Lakshmi Devi : గుమ్మం పైన ఈ ఫోటోలు ఉండే ఇళ్లకు లక్ష్మీదేవి ఎప్పటికీ రాదు…!

Lakshmi Devi : గుమ్మం పైన ఈ ఫోటోలు ఉండే ఇళ్ళకి లక్ష్మీదేవి ఎప్పటికీ వెళ్ళదు. వీరు పేదరికం అనుభవిస్తారు..అయితే ఎలాంటి లక్ష్మీదేవి ఫోటోలు గుమ్మం పైన ఉండకూడదు అనే విశేషాలు తెలుసుకుందాం.. శ్రీ మహాలక్ష్మి పాలనలో జలతత్వం పొంది నీటి నుండి ఉద్భవించింది. ఈ విశ్వం మొత్తం ప్రళయం అనంతరం జలమయం అవుతుంది. అందులో నుండే తిరిగి సృష్టి అనేది ప్రారంభమవుతుంది. నీటికే నారము అనే పేరు కూడా ఉంది. నీటి యందు ఆశ్రయం కలిగినటువంటి […]

 Authored By aruna | The Telugu News | Updated on :26 January 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Lakshmi Devi : గుమ్మం పైన ఈ ఫోటోలు ఉండే ఇళ్లకు లక్ష్మీదేవి ఎప్పటికీ రాదు...!

Lakshmi Devi : గుమ్మం పైన ఈ ఫోటోలు ఉండే ఇళ్ళకి లక్ష్మీదేవి ఎప్పటికీ వెళ్ళదు. వీరు పేదరికం అనుభవిస్తారు..అయితే ఎలాంటి లక్ష్మీదేవి ఫోటోలు గుమ్మం పైన ఉండకూడదు అనే విశేషాలు తెలుసుకుందాం.. శ్రీ మహాలక్ష్మి పాలనలో జలతత్వం పొంది నీటి నుండి ఉద్భవించింది. ఈ విశ్వం మొత్తం ప్రళయం అనంతరం జలమయం అవుతుంది. అందులో నుండే తిరిగి సృష్టి అనేది ప్రారంభమవుతుంది. నీటికే నారము అనే పేరు కూడా ఉంది. నీటి యందు ఆశ్రయం కలిగినటువంటి శ్రీ మహా విష్ణువు నారాయణుడు అయ్యాడు. సర్వశక్తులను తన శక్తిలో విముచుకున్నటువంటి జలం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం అయిన తామరసమును ఈ ప్రపంచాన్ని పరిపాలించిన సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవి భూతత్వంతో భూదేవిగా జన్మించింది. తర్వాత రేవంతం హనుమంతర కాలంలో పిలువ వృక్ష స్వరూపినిగా ఆవిర్భవించింది అని వేదం చెబుతోంది. భక్తులలోని ఆ శివ అపరాధ ఛాయలన్నిటిని కూడా నిర్మూలించగలరని తద్వారా లక్ష్మీ కళ కలగాలని శ్రీ సూక్తం నిర్వచిస్తుంది. పువ్వులు లేకుండా ఫలములను అందించే అద్భుత శక్తి బిల్వ వృక్షానికి ఉంది. బిల్వ వృక్షం అంటే మారేడు దళం ఆ మారేడు దళం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. మహాలక్ష్మి దేవిని మారేడు దళాలతో ఆరాధించిన వారికి సకల శుభాలు కలుగుతాయి.  సప్త మనవులలో ఆరవ వాడైన మనవు కాలంలో శ్రీమహాలక్ష్మి దేవి కమల రూపినిగా కమలమందు ఆవిర్భవించింది.

పాలసముద్రం నుంచి చంద్ర సహోదరిగా ఆవిర్భవించే తనను నమ్మి కొలచిన వారందరికీ కూడా సర్వస్వభాగ్యాలను ప్రసాదిస్తోంది. అయితే మనం నిత్యం చేసేటువంటి కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి రాకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే లక్ష్మీదేవి రాకపోతే ఎప్పుడూ పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటాం. ముఖ్యంగా గుమ్మం పైన కొన్ని వస్తువులు ఎవరైతే పడతారో వారి ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదు అని శాస్త్రం చెబుతోంది. వారు నిత్యం పేదరికం అనుభవిస్తూ ఉంటారని శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరి గుమ్మం మీద పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుమ్మం అనేది లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గుమ్మం విషయంలో ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలన్నా లక్ష్మీదేవి గుమ్మం నుండే వస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా మన సింహద్వారాన్ని చాలా శుభ్రంగా అందంగా అలంకరించుకోవాలి. అలా అందంగా అలంకరించుకొని ఉన్న గుమ్మం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. లేకపోతే అలాంటి గుమ్మం మీద కూర్చుని ఉన్నది కానీ లేదా నుంచుని ఉన్నది కానీ ఏది కూడా లక్ష్మీ స్వరూపాన్ని పెట్టకూడదు. అలా పెడితే ఎప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు. ఇంకొక విషయం ఏమిటంటే చాలామంది ఇంటి లోపల వైపు సింహద్వారం పైన గడియారాన్ని పెడుతూ ఉంటారు. రోజు ఆ గడియారం కింద నుండి నడుస్తూ ఉంటారు. కాలం కింద నడుస్తారు.. ఇలా కాలం కింద నడిస్తే త్వరగా మోక్షం ప్రాప్తిస్తుంది. అంటే త్వరగా చనిపోతారని అర్థం.

ఇలా సింహద్వారం పైన గడియారం పెట్టడం వల్ల ఆయుష్షు అనేది కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా కాలాన్ని సూచించే గడియారని సింహద్వారానికి పైన తగిలించకూడదు. లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి రాదు.. కాబట్టి గుమ్మం పైన లక్ష్మీదేవి ఫోటోలు గడియారాలు అసలే పెట్టవద్దు. అలాగే మనం పండగలు, పబ్బాలు వచ్చినప్పుడు శుభకార్యాలు చేసుకుంటున్నప్పుడు పూలతో తోరణాలు చేసి కడుతూ ఉంటాము..అవి కొన్ని రోజులకు ఆ పూలు వాడిపోతాయి. కొంతమంది ఆ వాడిపోయిన దండలు తీయకుండా అలాగే వదిలేస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడైతే ఆ వాడిపోయిన పువ్వులు వాడిపోయిన మావిడాకులు గుమ్మానికి ఉంటాయో ఆ లక్ష్మీదేవి అసలే ఇంట్లోకి అడుగుపెట్టదు. ఎంత కష్టపడినా ఫలితం కూడా రాదు. ఇది వాస్తు శాస్త్రంలో చెప్పబడినటువంటి నియమాలు.. ఒకవేళ ఇవే తప్పులు మీరు చేస్తూ ఉన్నట్లయితే గనక లక్ష్మీదేవి ఎప్పటికీ మీదరి చేరదు అని చెప్పుకోవాలి. ఈ మూడిళ్లకు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి వెళ్ళదు.. ఒకరికొకరు గౌరవించుకునే కుటుంబ సభ్యులు ఉండే కుటుంబం పై నా కటాక్షం ఎప్పుడు ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా లక్ష్మీదేవి ఇంద్రునికి చెబుతుంది. కాబట్టి లక్ష్మి మన ఇంటికి రావాలి అంటే ఏమేం పనులు చేయాలి. ఏమేం పనులు చేయకూడదనే విషయాలను సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి తాను ఉద్భవించిన సందర్భంగా ఇంద్రుడికి చెప్పింది. మరి ఈ నియమాలు కనుక పాటిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది…

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక