Lakshmi Devi : ఇవి పాటిస్తే.. లక్ష్మీ దేవి మీ ఇంట్లో శివతాండవం చేస్తుందట!
Lakshmi Devi : ఇంట్లో ఉన్న మసస్యలు, చికాకులు తొలిగిపోవడానికి చాలా మంది ఏవేవో చేస్తుంటారు. ఏం చేసినా తమ కష్టాలు తీరడం లేదంటూ స్వామీజిలు, జ్యోతిష్య శాస్త్ర నిపుణుల వద్దకు వెళ్తుంటారు. కానీ ఇంట్లో ఉండే ఇవి పాటిస్తే.. మీ సమస్యలను అన్నీ తొలిగిపోతాయి. అంతేనా లక్ష్మీ దేవి మీ ఇంటిని అస్సలే వదిలి పోదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్న నెగిటివిటీని బయటకు పంపి.. పాజిటివిటీకి ఆహ్వానం పలకితే చాలట. మీరు అనుకున్నవన్ని అవ్వడమే కాకుండా మీ ఇంట్లో ఊహించనంత డబ్బు వచ్చి చేరుతుందట. అయితే నెగిటివిటీని దూరం చేసి పాజిటివిటీని ఇంట్లోకి ఆహ్వానించడానికి చేయాల్సిన పనులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.చాలా మంది ఎప్పుడూ తలుపులు, కిటికీలు వేసుకొని ఇంట్లోనే కూర్చుంటారు.
అలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న గాలి అంతా అలాగే ఉండిపోయి శ్వాస ఆడకుండా అవుతుంది. ఇంచ్లో ఉన్న నెగిడివ్ వైబ్రేషన్స్ అన్నీ అలాగే ఉండిపోతాయి. నెగిటివిటీ బయటకు పోవాలంటే స్వచ్ఛమైన గాలి లోపలికి వచ్చేలా చేయాలి. అప్పుడే ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా పోయి పాజిటివిటీ వస్తుంది.ఇళ్లంతా ప్రశాంతంగా ఉంటుంది. అలా ప్రశాంతంగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీ దేవి వస్తుందట. అదే కాకుండా ఇంటిని వదిలి ఎప్పటికీ వెళ్లిపోదట. అలాగే ఇంట్లో పనికి రాకుండా.. దుమ్ము పట్టి పోయిన సామాన్లను ఇంట్లో ఉంచకూడదట. ఇలాంటి సామాన్ల వల్ల నెగిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందట. అందుకే వీలైనంత వరకు పాడైపోయిన సామాన్లను ఇంట్లో ఉంచకండి. అలాగే వీలైతే ప్రతి రోజూ మంచి సువాసనను ఇచ్చే అగరత్తీలు వెలిగిస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. అందుకే ఇంట్లో దీపం పెట్టే వారాలే కాకుండా ప్రతిరోజూ కనీసం అగరుబత్తీలు అయినా వెలిగించండి.
అలాగే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే అప్పుడప్పుడూ ఇంట్లో సాంబ్రాణి పొగ వేయాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల నెగిటివిటీ దూరం అవ్వడమే కాకుండా పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. అలాగే క్రిస్టల్స్ లాంటివి ఉపయోగించడం వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. రోజ్ క్వార్ట్స్ లాంటి వాటిని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉన్న చోట పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుందట. అలాగే మనం రోజూ వంటల్లో వాడే ఉప్పు వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుందట. ఇంట్లోని ప్రతీ గదిలో ఉప్పు పెట్టి 48 గంటల తర్వాత దాన్ని తుడిచేస్తే.. నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవచ్చట. నెగిటివ్ ఎనర్జీ ఇంటిని వదిలితే.. పాజిటివ్ ఎనర్జీ కచ్చితంగా వస్తుంది. మన ఇంట్లో ఉన్న కష్టాలు పోయి మనకు మంచి జరగాలంటే ఇలాంటి చిన్న చిన్న పనులు చేయాల్సిందేనని పెద్దలు చెబుతున్నారు.