lord ganesh : తొండం లేని నరముఖ గణపతి ఆలయం మీకు తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

lord ganesh : తొండం లేని నరముఖ గణపతి ఆలయం మీకు తెలుసా..?

 Authored By keshava | The Telugu News | Updated on :1 February 2021,6:00 am

గణపతి… అనగానే అందరికీ ముందు గుర్తుకువచ్చేది తొండం. స్వామి ఏకదంతం. అయితే స్వామికి తొండం లేని గణపతిని ఎవరూ ఊహించరు కానీ తొండం లేని గణపతి ఆలయం ఒకటి మనదేశంలో ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది నిజం ఆ దేవాలయం విశేషాలు తెలుసుకుందాం….

Loard Ganesh mysterious temple thilatharpanapuri

Loard Ganesh mysterious temple thilatharpanapuri

ఈ దేవాలయం తిలతర్పణపురి అనే గ్రామంలో వున్న స్వర్నవల్లి సమేత ముక్తీశ్వారర్ ఆలయం. బాలగణపతి. ఇక్కడ నరముఖంతో వున్న గణపతి వున్నారు. ఇక్కడ గణపతి తొండం లేకుండా బాలగణపతి రూపంలో మనిషి ముఖంతో వుంటారు. ఇలాంటి ఆలయం చాలా అరుదుగా వుంటుంది. నరముఖగణపతి ఈ ఆలయం ముఖ్యంగా నరముఖ గణపతి లేదా ఆది వినాయకర్ గణపతితో చాలా ప్రసిద్ధి చెందినది. ఇక ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం.. ఈగ్రామానికి తిలతర్పణపురిగా పేరుగాంచింది.

తిలతర్పణపురి

ఇక్కడ రాములవారు తన తండ్రి అయిన దశరథునికి నాలుగు పిండాలు పెట్టగా ఆ వంశంలోని వారు లింగాలరూపంలో మారటం జరిగింది. అందువలన ఈ ఊరిని తిలతర్పణపురి అని పిలవటం జరుగుతుంది. త్రివేణిసంగమం
ఈ ఆలయం ముఖ్యంగా భారతదేశంలోనే 7 స్థలాలుగా చెప్పబడే కాశీ, రామేశ్వరం, శ్రీవాణ్యం, తిరువెంకాడు, గయ, త్రివేణి సంగమంతో సరిసమానమైన స్థలంగా చెప్పబడుతోంది.

ఎవరైతే పెద్దలకు కార్యక్రమాలు నిర్వహించలేక ఎన్నో బాధలతో ఇబ్బంది పడుతూవుంటారో వారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణాలు వదలటం ద్వారా ఆ దోషాల నుంచి విముక్తి పొందగలరు.

ఎలా వెళ్ళాలి ?

ఈ దేవాలయం కూతనూరు సరస్వతీ ఆలయానికి 3 కి. మీల దూరంలోను, తమిళనాడులోని తిరునల్లార్శని భగవానుని ఆలయానికి 25కి.మీ ల దూరంలో ఉంది.

Also read

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది