Chanakya Niti : ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ ఐదు సూత్రాలు పాటిస్తే డబ్బులు వృథా కావు!
Chanakya Niti : జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు కొందరు మోటివేషనల్ వీడియాలు చూస్తుంటారు. మరికొందరు వ్యక్తిత్వ వికాస నిపుణుల సాయం తీసుకుంటారు. అయితే, ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు తెలుసుకుంటే తప్పకుండా జీవితంలో మంచి స్థానానికి చేరుకుంటారు. ఆయన మంచి రాజకీయవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త మాత్రమే కాదు అనేక విషయాలపై అవగాహన కలిగిన వ్యక్తి.. తన అనుభవాలను అనేక శాస్త్రాలుగా లిఖించాడు. చాణుక్యుడు రచించిన నీతి శాస్త్రం నేటి మానవులకు అనేక జీవిన విధానాలను నేర్పుతోంది. వాటిని ఆచరిస్తే ఆ మనిషి జీవితం ఏ కష్టాలు లేకుండా సాఫీగా సాగిపోతుందని కొందరు బలంగా నమ్ముతుంటారు. చాణుక్యుడు ఒక వ్యక్తిని నాశనం చేసే ఐదు చెడు అలవాట్ల గురించి విపులంగా వివరించాడు. వీటిని వదిలేయడం వలన మనిషి తన జీవితంలో అనుకున్నది సాధిస్తాడని, ఎంతో మేలు జరుగుతుందని వెల్లడించాడు.
మనుషులను ఆర్ధికంగా ఇబ్బందులకు గురి చేసే ఆ ఐదు అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.కోపంగా ఉన్న సమయంలో వ్యక్తులు ఎల్లప్పుడూ సరైన నిర్ణయం తీసుకోలేరు. ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడమే కాదు. పట్టుదలతో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. అటువంటి వ్యక్తి ఎన్ని ఉన్నప్పటికీ అన్నింటినీ కోల్పోతాడు. అంతేకాదు అటువంటి వ్యక్తుల దగ్గర లక్ష్మీదేవి ఉండేందుకు అంతగా ఆసక్తి చూపించదు. డబ్బుల కొరతతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. లక్ష్మి దేవి అనుగ్రహం వల్ల ఎవరికైనా ధనం లభిస్తే దానిని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకానీ ధనం ఉందని అహంకారంతో ఇతరులను కించపరిచే విధంగా ప్రవర్తిస్తే అటువంటి వారిపై లక్ష్మిదేవి ఎప్పుడూ ఆగ్రహంగా ఉంటుంది. దీంతో వారి డబ్బులు కోల్పోవడానికి ఎక్కువ సమయం పట్టదు.

money is not wasted five principles mentioned by acharya chanakya are followed 2
Chanakya Niti : ఈ అలవాట్లు వెంటనే మానుకోవాలి
సన్మార్గంలో పయనిస్తూ కష్టపడి డబ్బు సంపాదించే వారి పట్ల లక్ష్మిదేవి కరుణిస్తుంది. అంతే గానీ అత్యాశగల వ్యక్తి ఎప్పుడు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటాడు. డబ్బుమీద అత్యాశతో తప్పుడు మార్గాన్ని ఎంచుకునే వారు, ఇతరుల సంపదపై దృష్టి సారిస్తారు. క్రమంగా వారి దగ్గర ఉంది ప్రతిదీ నాశనం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే సోమరితనాన్ని విడిచి కష్ట పడాలి. సోమరి తన సమయాన్ని వృథా చేస్తుంటాడు. అంతేకాదు తన దగ్గర ఉన్న ధనాన్ని విపరీతంగా ఖర్చు చేస్తాడు. డబ్బులను అస్సలు దుర్వినియోగం చేయొద్దు. అవసరమైన వారికి, ఆపన్నులకు సహాయం చేయడం వంటి మంచి పనులకు డబ్బులను ఉపయోగించండి. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసే వారి చెంత లక్ష్మీ దేవి ఉండేందుకు ఇష్టపడదు.