Astrology Moon Navagraham : పార్ట్ -2వ ..నవ గ్రహ చంద్రుడు అనుగ్రహిస్తే ఏటువంటి ఫలితాలు కలుగుతాయి ?
Astrology Moon Navagraham చంద్రుడు నవ గ్రహం అనుగ్రహిస్తే :
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహలలో రెండోవ గ్రహం చంద్రుడు .ఈ గ్రహన్ని మన:కారకుడిగా పేర్కోన్నారు. చంద్రుడు మనసుకు అధిపతి .అందుకే మానవ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపేది ఈ గ్రహమే . శుక్ల ,కృష్ట పక్షాలలో చంద్రుడి కళల్లో హెచ్చు తగ్గులను అనుసరించి ..మనసు ప్రభావితం అవుతుందని శాస్త్ర వచనం . చంద్రుడి అనుగ్రహం కలిగితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. చెడు ఆలోచనలు దూరమవుతాయి .పంటలు సంవృద్ధిగా పండుతాయి .పాడి అభివృద్ధి చెందుతుంది .కావునా చంద్రోపాసన చేయడం వలన మనోబలం పెరుగుతుంది .ఆధ్యాత్మిక శక్తి కలుగుతుంది. శివారాధనతో చంద్రుణ్ని ప్రసన్నం చేసుకోవచ్చు .

moon navagraham results and effect of the moon on the earth
Astrology Moon Navagraham భూమి పై చంద్రుడు ప్రభావం ఏలా ఉంటుంది :
అంతే కాదు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నపుడు ముఖ్యంగా భూమి పై సముద్రంలో సంభవించే ఆటుపోట్లకి కారనం చంద్రుడే .అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ..చంద్రుడు భూమి దగ్గరకు వచ్చినప్పుడు సముద్రంలో కోన్ని వేల చదరపు కీలో మీటర్ల వైశాల్యంలో నీటి బుగ్గ పైకి లేస్తుంది.అది పైకి బోర్లిచిన్న గిన్నెలా సముద్ర జలాలో కనిపిస్తుంది .చంద్ర భ్రమణంతో పాటుగా ఆ నీటి బుగ్గ సముద్రంపై తేలియాడుతూ ప్రయాణిస్తుంది.దిని వలనే పోటు వచ్చి సముద్ర జలాలు ఉప్పోంగుతాయి .దిని వలన చంద్రుణి ప్రభావం భూమి పై ఉందని నిరూపణ అయింది . చంద్రుడుని అనుగ్రహం కోసం ఈ శ్లోకాన్ని పఠించండి.
శ్లోకం : ఓం దధిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం!
నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం !!
జపాలు : 10 వేల సార్లు
దానం : బియ్యం