Nara Disti : ఈ లక్షణాలు ఉంటే మీ ఇంట్లో చెడు గాలి ఉన్నట్లే లెక్క…!
Nara Disti : ఈ సృష్టిలో దైవ శక్తి ఎలా ఉందో.. అలానే దుష్టశక్తి కూడా ఉంది. దీని గురించి మన ఋషులు అనేక గ్రంథాల్లో పొందుపరిచారు. తాంత్రిక శక్తి ప్రయోగం ఉపసంహరణల గురించి అధర్వణ శాస్త్రంలో విపులంగా వివరించబడింది. కంటి చూపు ద్వారా ఎదుటి వ్యక్తి మీదకు ట్రాన్స్ఫర్ అవుతుంది. మన కంటికి చాలా శక్తి ఉంటుంది. నరుడు దృష్టికి నల్లరాయి అయినా పగులుతుంది అనేది మన పెద్దలు చెప్పే మాట.. మనలోని భావాలన్నీ కన్ను […]
ప్రధానాంశాలు:
Nara Disti : ఈ లక్షణాలు ఉంటే మీ ఇంట్లో చెడు గాలి ఉన్నట్లే లెక్క...!
Nara Disti : ఈ సృష్టిలో దైవ శక్తి ఎలా ఉందో.. అలానే దుష్టశక్తి కూడా ఉంది. దీని గురించి మన ఋషులు అనేక గ్రంథాల్లో పొందుపరిచారు. తాంత్రిక శక్తి ప్రయోగం ఉపసంహరణల గురించి అధర్వణ శాస్త్రంలో విపులంగా వివరించబడింది. కంటి చూపు ద్వారా ఎదుటి వ్యక్తి మీదకు ట్రాన్స్ఫర్ అవుతుంది. మన కంటికి చాలా శక్తి ఉంటుంది. నరుడు దృష్టికి నల్లరాయి అయినా పగులుతుంది అనేది మన పెద్దలు చెప్పే మాట.. మనలోని భావాలన్నీ కన్ను బయటకు వ్యక్తపరుస్తుంది. మనం ఆనందంగా ఉన్నప్పుడు కంటి నుండి పాజిటివ్నెస్తో కూడిన ఆనందభాష్పాలు బయటకు వచ్చినట్లే.. ఎవరి మీద అయినా కోపంగా అసూయంగా ఉన్నప్పుడు మన కంటి నుండి నెగటివ్ ఎనర్జీ అనేది బయటకు వస్తుంది.ఎదుటివారి మీద పడినప్పుడు అది వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది. వేరే మంత్రాల ద్వారా ఎలా అయితే దైవ శక్తిని ప్రేరేపించగలము అలా అని కొన్ని బీజాక్షరాలతో కూడిన తాంత్రిక మంత్రాలతో దుష్టశక్తులను ప్రేరేపించవచ్చు..
కొందరు తాంత్రికలు ఈ క్షుద్ర మంత్రాలతో దుష్టశక్తులను మన ఇంటి మీద ఉసిగొల్పడం వల్ల మన ఇంటిలోనికి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అలానే కొంతమంది ఎవరైనా వారి కళ్ళ ఎదుట బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేరు. ఏమీ లేని వాడు ఇలా వచ్చి అలా బాగుపడిపోతున్నాడు అంటూ లో లోపల కుళ్ళిపోతూ ఉంటారు. దీనినే నరగోష అంటారు. ఈ నెగటివ్ ఎనర్జీ మన ఇంటి మీద ప్రసరించినప్పుడు ఇంట్లో ఊరికే గొడవలు రావడం అనారోగ్య సమస్యలు వంటివి ఎదురవుతూ ఉంటాయి. ఈ నెగటివ్ ఎనర్జీని కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయడం ద్వారా మన ఇంటి నుండి బయటకు వెళ్లగొట్టొచ్చు.. మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని అనుకున్నప్పుడు సాంబ్రాణి, గుగ్గిళ్ళం మిక్స్ చేసి ధూపాన్ని ఇల్లంతా చూపిస్తూ గంట వాయిస్తూ తిరగాలి. ఈ ధూప ఇంట్లో ఏమైనా దుష్ట శక్తులు ఉంటే వాటిని ఉక్కిరిబిక్కిరి చేసి బయటకు పోయేలా చేస్తుంది. ఇలా తరచూ చేస్తూ ఉంటే మన ఇంట్లోకి ఎలాంటి నెగటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించలేదు. అలానే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున గుమ్మడికాయ బొట్టు పెట్టి ఇల్లంతా తిప్పి దానిని మెయిన్ గుమ్మం దగ్గరకు తీసుకొచ్చి గుమ్మం ఎదురుగా ప్రదక్షిణంగా అప్రదక్షిణంగా మూడుసార్లు తిప్పి నేలకేసి గట్టిగా పగలగొట్టాలి.
గుమ్మడికాయ నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఉంటుంది. అందుకే గుమ్మడికాయలు ను వేలాడదీస్తారు. ఒకవేళ అలా కట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోతే మీ ఇంటి మీద బాగా గోల ఉన్నట్లు లెక్కే.. ఈ దిష్టి పోవాలంటే మీ ఇంట్లో గాజు పాత్రలో ఉప్పు వేసి దానిని ఇంట్లోని ప్రతి గది తిప్పి చివరగా ఆ గ్లాసుని ఇంటి నైరుతి మూలన ఎవరు తిరగని ప్రదేశంలో ఉంచాలి.అలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఉప్పు లాగేసుకుంటుంది. అలానే ఇల్లు కడిగేటప్పుడు నీళ్లలో కళ్ళు ఉప్పు కలిపి శుభ్రం చేసుకుంటే ఆ ఉప్పు నీరు మూలమూలాల్లో దాక్కున్న నెగిటివ్ ఎనర్జీని కడిగేస్తుంది. అలానే నిమ్మకాయలు, మిరపకాయలను తీసుకొని ఒక దారానికి గుచ్చి ఇంటి ప్రధాన గుమ్మం ఎదురుగా కట్టాలి. నిమ్మ మిరపకాయలకు నెగిటివ్ ఎనర్జీని తనలోనికి తీసుకునే శక్తి ఉంటుంది. ఏదైనా దుష్ట శక్తి మన ఇంటి లోపలకు ప్రవేశిస్తుంటే గుమ్మం బయట ఉన్న ఇవి దానిని ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. వీటితోపాటు పటిక, కలబంద లు కూడా నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించి అది మన మీద ప్రభావం చూపకుండా చేస్తాయి…