Nervousness : గుమ్మడికాయ తో ఇలా చేస్తే నరదిష్టి నుంచి బయటపడతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nervousness : గుమ్మడికాయ తో ఇలా చేస్తే నరదిష్టి నుంచి బయటపడతారు…!

Nervousness : మన ఇంటికి గనుక ఇలా దిష్టి తీస్తే ఐశ్వర్యం మీ సొంతమవుతుంది అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. అంటే ఇంటి ముందు నిమ్మకాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఇలా కట్టడం మనం చూస్తూ ఉంటారు. అయితే వీటన్నిటికంటే కూడా భిన్నంగా ఈ విధంగా దిష్టి తీయడం వలన ఐశ్వర్యం మీ సొంతమవుతుంది అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. దిష్టి తీయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అంటే మనం కూర వండుకునే గుమ్మడికాయ అలాగే నిమ్మకాయలు ఈ రెండు పరిహారాలు […]

 Authored By aruna | The Telugu News | Updated on :4 August 2023,8:00 am

Nervousness : మన ఇంటికి గనుక ఇలా దిష్టి తీస్తే ఐశ్వర్యం మీ సొంతమవుతుంది అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. అంటే ఇంటి ముందు నిమ్మకాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఇలా కట్టడం మనం చూస్తూ ఉంటారు. అయితే వీటన్నిటికంటే కూడా భిన్నంగా ఈ విధంగా దిష్టి తీయడం వలన ఐశ్వర్యం మీ సొంతమవుతుంది అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. దిష్టి తీయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అంటే మనం కూర వండుకునే గుమ్మడికాయ అలాగే నిమ్మకాయలు ఈ రెండు పరిహారాలు గనక చేస్తే ఆ ఇంట ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది. అంటున్నారు. మరి ఇంటికి పట్టిన నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలంటే మనం చాలా చిన్న చిన్న పరిహారాలు గనక పాటిస్తూ ఉంటే ఇవన్నీ కూడా తొలగిపోయి సిరిసంపదలు మన ఇంటికి కలుగుతాయి.

ఐశ్వర్యం వస్తుంది. మరి ఆ పరిహారాలు ఏమిటి అంటే మన ఇంటికి దాదాపుగా మన ఇంటి వైపు ఎవరైతే చూస్తూ ఉంటారో వారందరి కళ్ళల్లో ఉండేటువంటి దృష్టి దోషం అనేది మన ఇంటి మీద పడుతుంది. అందుకని మనం ఇంటికి దిష్టి తీసేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు దిష్టి అనేది తీయాలి అంటే ప్రతి అమావాస్య రోజున ఒక గుమ్మడికాయ అంటే మనం కూర వండుకునే గుమ్మడికాయను తీసుకొని వచ్చి దాని మీద ముద్ద కర్పూరం పెట్టి వెలిగించి ఇంటి ముందు నిలబడి మూడుసార్లు సవ్య దిశగా దిష్టి తీసి మూడుసార్లు అపసవ్య దిశగా దిష్టి తీయాలి. అలా దిష్టి తీసిన తర్వాత వెలుగుతున్న కర్పూరాన్ని దూరంగా పారేసి ఇంటిగడపుకు ముందుగాని గేటు ముందుగాని గుమ్మడికాయని పగలగొట్టేసి దానిలో కొంచెం పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకొని వాటిని గుమ్మానికి రెండు వైపులా పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు తుడుచుకొని లోపలికి కుడి కాలు పెట్టి వెళ్ళాలి.

If you do this with pumpkin you will get rid of nervousness

If you do this with pumpkin, you will get rid of nervousness

ఇదంతా కూడా అమావాస్య రోజున ఉదయాన్నే చేయాలి. తర్వాత రోజు ఉదయం ఆ గుమ్మడికాయ ముక్కలను తీసి పారేయాలి. అలా ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని దాని ఇంటి గడప మీద పెట్టి కత్తితో రెండు ముక్కలుగా కోసి వాటికి కొంచెం కుంకుమ తీసుకొని ఆ ముక్కలకు వేసి గుమ్మానికి రెండు వైపులా అలంకరిస్తే ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి నరఘోష, నర పీడ, నరదృష్టి, నకారాత్మక శక్తి అంతా కూడా తొలగిపోయి ఇంట్లోకి సిరిసంపదలు వచ్చి చేరుతాయి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది