Pumpkin Seeds | మీ బాడీలో కొవ్వుని క‌రిగించే దివ్య ఔష‌దం.. ప‌చ్చ‌గా ఉన్నాయ‌ని ప‌డేయ‌కండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pumpkin Seeds | మీ బాడీలో కొవ్వుని క‌రిగించే దివ్య ఔష‌దం.. ప‌చ్చ‌గా ఉన్నాయ‌ని ప‌డేయ‌కండి..!

 Authored By sandeep | The Telugu News | Updated on :28 August 2025,7:00 am

Pumpkin Seeds | ఇప్పటి కాలంలో పని ఒత్తిడి, తప్పుడు జీవనశైలి, శారీరక శ్రమలేని జీవితం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.కొలెస్ట్రాల్ తక్కువ మొత్తంలో శరీరానికి అవసరం. కానీ ఎక్కువగా పెరిగినప్పుడు, అది గుండె నాళాల్లో పేరుకుపోయి రక్తప్రవాహానికి అడ్డుగా మారి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు సహజ మార్గాల్లో ఒకటి గుమ్మడికాయ గింజలు.

#image_title

ఆరోగ్యానికి బెస్ట్..

గుమ్మడికాయ గింజల ఆరోగ్య ప్రయోజనాలు చూస్తే.. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయం చేస్తుంది. గుమ్మడికాయ గింజలు ఎక్కువ మోతాదులో ఫైబర్ కలిగి ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, ప్రేగుల్లో కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుంది.వాటిలో ఉండే ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు మంచి కొలెస్ట్రాల్‌ను (HDL) పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గిస్తాయి.

ఫైటోస్టెరాల్స్ అనే సహజ మూలకాలు కూడా ఉండటం వల్ల, శరీరంలో కొలెస్ట్రాల్ శోషణ తగ్గి, రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయి.గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల, రక్తనాళాలు సడలుతాయి. ఫలితంగా రక్తపోటు నియంత్రణ జరుగుతుంది.వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరంలోని మంటను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

గుమ్మడికాయ గింజల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం, శరీరంలోకి వెళ్లి సెరోటోనిన్గా మారుతుంది. ఇది మంచి నిద్రకి, ఒత్తిడి తగ్గించేందుకు ఉపయుక్తం.జింక్ కూడా గింజలలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. గుమ్మడికాయ గింజలలో జింక్, ఇతర పోషకాలు ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ప్రోస్టేట్ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులో విటమిన్ E, కెరోటినాయిడ్లు వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల, శరీర కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షణ కలిగిస్తుంది. వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది