Numerology : ఈ తేదీల్లో జన్మించిన వారు కూల్ గా, ఫన్నీగా ఉంటారు.. అలాగే చాలామందితో ప్రేమలో పడతారు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Numerology : ఈ తేదీల్లో జన్మించిన వారు కూల్ గా, ఫన్నీగా ఉంటారు.. అలాగే చాలామందితో ప్రేమలో పడతారు..

Numerology : న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి వారి గురించి ఒక అంచనా వేయవచ్చు. సంఖ్యాశాస్త్రంలో ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలను ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సంఖ్యలో ఒకటి నుంచి తొమ్మిది దాకా మరొక గ్రహం తో సంబంధం కలిగి ఉంటాయి. రాడిక్స్ నెంబర్ 4 రాహు గ్రహానికి సంబంధించింది. ఏదైనా నెలలో 4 ,13 ,22 ,31వ తేదీలలో జన్మించిన వారి రాడిక్స్ 4 అవుతుంది. అయితే రాడిక్స్ సంఖ్య […]

 Authored By prabhas | The Telugu News | Updated on :26 July 2022,8:20 am

Numerology : న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి వారి గురించి ఒక అంచనా వేయవచ్చు. సంఖ్యాశాస్త్రంలో ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలను ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సంఖ్యలో ఒకటి నుంచి తొమ్మిది దాకా మరొక గ్రహం తో సంబంధం కలిగి ఉంటాయి. రాడిక్స్ నెంబర్ 4 రాహు గ్రహానికి సంబంధించింది. ఏదైనా నెలలో 4 ,13 ,22 ,31వ తేదీలలో జన్మించిన వారి రాడిక్స్ 4 అవుతుంది. అయితే రాడిక్స్ సంఖ్య 4 ఉన్న వ్యక్తులు ఇతరులతో కూల్ గా, ఫన్నీగా ప్రేమగా ఉంటారు. అందుకే అందరూ వీరిని చాలా విధేయులుగా, అత్యంత విశ్వసనీయంగా భావిస్తారు. మీరు ఎల్లప్పుడూ అన్ని వ్యవహారాలలో స్నేహితులతో, బంధువులతో నిజాయితీగా ఉండాలనుకుంటారు.

న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్ నెంబర్ 4 ఉన్న వ్యక్తులు వారి జీవితంలో చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఈ వ్యక్తులు దేని గురించి ఎప్పుడూ అతిగా ఆలోచించరు. మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. అంతేకాదు ఇతరులతో ఫన్నీ ఫన్నీగా ఉంటూ, అందరిని సంతోషపడతారు. ఈ వ్యక్తులు జీవితంలో సమయపాలనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రయాణాలు అంటే చాలా ఇష్టపడతారు. ఈ వ్యక్తులు కొన్నిసార్లు జీవితంలో గొప్ప గొప్ప పనులను చేస్తుంటారు. మీరు చేసిన పనిని చూసి చుట్టూ పక్కల జనాలు ఆశ్చర్యపోతారు. అలాగే ఈ వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. కానీ వారు కూడా కొంత అనుమానాస్పద స్వభావం కలిగి ఉంటారు.

Numerology Life path number 4 people looks like cool and fun

Numerology Life path number 4 people looks like cool and fun

ఈ వ్యక్తులు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. దీని వలన వారికి చాలా మంది వ్యక్తులతో దగ్గరి అనుబంధాలు ఉంటాయి. వీరు ఇతరులను, ఇతరులు వీరిని ఎక్కువగా ప్రేమిస్తారు. మాట్లాడే విధానం చాలా ప్రభావంతంగా ఉంటుంది. వీరి సంభాషణ ద్వారా ఇతర వ్యక్తులపై ప్రభావంతో ఉంటుంది. ఏ విషయాలలోనైనా బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్ నెంబర్ నాలుగు ఉన్న వ్యక్తులు వ్యాపార రంగంలో బాగా అభివృద్ధి చెందుతారు. అలాగే వీరు ఇంజనీర్, లాయర్, డాక్టర్, పొలిటికల్ లీడర్, శాస్త్రవేత్త పారిశ్రామికవేత్త మద్యం వ్యాపారిగా ఎదుగుతుంటారు. రాడిక్స్ నెంబర్ 4 ఉన్న వ్యక్తులు రహస్య విషయాలలో బాగా నైపుణ్యం కలిగి ఉంటారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది